Tuesday, December 10, 2024
Homeజిల్లాలుఅనంతపురండాక్టర్ హేమలతకు జాతీయ స్థాయి అవార్డు

డాక్టర్ హేమలతకు జాతీయ స్థాయి అవార్డు

విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆర్.ఎం.ఓ(రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్) డాక్టర్ జి.హేమలత జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ స్థాయి అవార్డుకు డాక్టర్ హేమలతను ఎంపిక చేశారు. ఈ మేరకు ఐఎంఏ సెక్రెటరీ డాక్టర్ అనిల్ కుమార్ జె నాయక్ మంగళవారం ప్రకటించారు.
డిసెంబర్ 27న హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగే నేషనల్ కాన్ఫరెన్స్ – ఉత్సవ్-2024 వేదికపై ఆమె ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ హేమలత.జి. విధి నిర్వహణలో నీతి, నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఆస్పత్రి అభివృద్ధితో పాటు రోగులు, వారి సహాయకుల కోణంలో ఆలోచిస్తూ మెరుగైన సేవలందించేందుకు పరితపిస్తారు.
ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారంతా పేద, మధ్య తరగతి వర్గాల వారే కావడంతో వారికి ఆస్పత్రిలో సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారి సాదకబాధకాలను మానవీయ కోణంలో ఆలోచించి, వాటి పరిష్కారానికి కృషి చేసారు. చేస్తున్నారు.
ఐఎంఏలోనూ ఇప్పటికే వివిధ హోదాల్లో అందించిన సేవలను గుర్తించిన ఐఎంఏ పెద్దలు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేయడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు