Wednesday, January 15, 2025
Home Blog Page 47

ఘనంగా గరిమెళ్ళ సత్యనారాయణ 72వ వర్ధంతి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమేష్.
విశాలాంధ్ర ధర్మవరం; స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు తిరుగుబాటు చేయడానికి తెలుగులో పాటలను రచించిన మహాకవి కీర్తిశేషులు గరిమెళ్ళ సత్యనారాయణ 72వ వర్ధంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చౌడప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గరిమెళ్ళ సత్యనారాయణ చిన్నప్పటి నుంచే పాఠశాలలోనే జానపద గేయాలు, శ్రమదోపిడి, ఆకలి చావులు, పోలీసుల అరెస్టులు, అంటరానితనము, దురదృష్టవశాత్తు వారు మరణించేటప్పుడు ఐదు సంవత్సరాలు కటిక పేదరికమును అనుభవించడం జరిగిందని తెలిపారు. వివిధ రకాల కథల రూపంలో ఉత్తేజపరిచిన మహోన్నత వ్యక్తి, ఆయన వారసత్వానికి సజీవుగా ఉంచడానికి 2020వ సంవత్సరంలో రాజమండ్రిలో శిక్షణ కళాశాలకు వారి పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. నేటి విద్యార్థులు వీరిని స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, బొమ్మన్న, అజంతా కృష్ణ, సాకే వెంకటేష్, రామాంజనేయులు, దేవరకొండ నరసింహులు, షాకే వీరనారప్ప, పెద్దన్న, మల్లికార్జున, నాగార్జున, ఆదినారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎంపీ అంబిక జన్మదిన వేడుకలు….

విశాలాంధ్ర పామిడి

అనంతపురం జిల్లా

అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మి నారాయణ జన్మదిన వేడుకలను గురువారం అనంతపురం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కేక్‌ను కట్‌ చేశారు సంబరాలు చేసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు కల్లుమడి ఓబిరెడ్డి మాట్లాడుతూ నీతి, నిజాయితీకి నిలువెత్తు రూపం నిస్వార్ధ ప్రజా సేవకు ప్రతిరూపం మన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఎల్.సి ఆయకట్టు చైర్మన్ ఓబుల రాజు, స్టోర్ డీలర్ కంబగిరియ్యా, చిన్న కృష్ణప్ప, వేణు, పెద్ద నటరాజు, తదితరులు పాల్గొన్నారు.

నలుగురు అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో ఏడాది నుండీ జరిగిన 33 దొంగతనాలలో రికవరీలు చూపిన పోలీసులు జిల్లా ఎస్పీ డి. జగదీష్ విశాలాంధ్ర అనంతపురం నలుగురు అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. జగదీష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

  • అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో ఏడాది నుండీ జరిగిన 33 దొంగతనాలలో రికవరీలు చేయడం జరిగిందన్నారు.
    అరెస్టు అయిన నిందితుల వివరాలు
    1 ) రాఘవేంద్ర, నూతిమడుగు గ్రామం, కంబదూరు మండలం
    2) చిరంజీవి, రాంపురం గ్రామం, కంబదూరు మండలం
    3) పరందామ, రాంపురం గ్రామం, కంబదూరు మండలం
    4) ఎర్రిస్వామి, నుతిమడుగు గ్రామం, కంబదూరు మండలం.
    పరారీలో ఉన్న నిందితులు వాసు, తిప్పేపల్లి గ్రామం, కంబదూరు మండలం వన్నూరుస్వామి @ జానీ వెంకటంపపల్లి అని తెలియజేశారు. వారి వద్ద నుంచి
    విద్యుత్ ట్రాన్సుఫార్మర్లకు సంబంధించిన 450 కిలోల రాగివైర్లు, 180 కిలోల అల్యుమినియం వైర్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఈనేపథ్యంలో అనంతపురం అడిషనల్ ఎస్ పి డి. వి .రమణ మూర్తి పర్యవేక్షణ లో, అనంతపురము సిసిఎస్ సి.ఐ లు ఇస్మాయిల్, జైపాల్ రెడ్డి మరియు అనంతపురం రూరల్ సి.ఐ శేఖర్, రూరల్ ఎస్‌ఐ రామ్ బాబు ల ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా వేశారు. పక్కారాబడిన సమాచారంతో ఈ సి.ఐ ల ఆధ్వర్యంలో సిసిఎస్ హెడ్ కానిస్టేబుళ్లు మల్లికార్జున, చంద్రశేఖర్, శ్రీధర్ ఫణి, శ్రీనివాసులు, నరసింహులు, వెంగప్ప… కానిస్టేబుళ్లు రంజిత్ కుమార్, బాలకృష్ణ, షామీర్ లు మరియు అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుళ్లు గిరిబాబు, ప్రసాద్, కానిస్టేబుళ్లు రాజు, శివయ్య, ప్రసాద్, పాండవ, అనిల్ కుమార్ లు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్థానిక కక్కలపల్లి సమీపంలోని ఓ గుడిసెలో దాచిన రాగి, అల్యుమినియం వైర్లను స్వాధీనం చేసుకున్నారు. రైతులను ఇబ్బందిపెడుతున్న ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న అనంతపురం సిసిఎస్ సి.ఐ ఇస్మాయిల్ మరియు అనంతపురం రూరల్ సి.ఐ శేఖర్, రూరల్ ఎస్‌ఐ రామ్ బాబు ల బృందాలను జిల్లా ఎస్పీ పి.జగదీష్ అభినందించారు.

గౌరవ హైకోర్టు సూచనలతో రోడ్డు భద్రత ఉల్లంఘనలపై చర్యలు మరింత పటిష్టం

జిల్లా అంతటా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఉధృతం…

ప్రజల భద్రతే ముఖ్యం

జిల్లా ఎస్పీ పి.జగదీష్

విశాలాంధ్ర -అనంతపురం : విశాలాంధ్ర- అనంతపురం : హైకోర్టు సూచనలతో రోడ్డు భద్రత ఉల్లంఘనలపై చర్యలు మరింత పటిష్టం చేస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… . హైకోర్టు తాజాగా సూచించిన మేరకు జిల్లా అంతటా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మరింత ఉధృతం చేస్తున్నామన్నారు. ఉల్లంఘనదారులకు చలానాలు జారీ అయ్యాక మూడు నెలల లోపు ఫైన్ అమౌంటు చెల్లించకపోతే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే ఆ తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా…డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్ సి లు, త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్, ఆటోల ఓవర్లోడింగ్, డ్రంకన్ డ్రైవ్, ఆపోజిట్ డ్రైవింగ్, నంబర్ లెస్ వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ లపై దృష్టి పెడతామన్నారు. ఉల్లంఘనదారులపై జరిమానాలు విధిస్తామన్నారు. ఈనేపథ్యంలో… డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆర్ సి లు లేకుండా వాహనాలలో తిరగరాదన్నారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ పార్కింగ్ లకు దూరంగా ఉండాలన్నారు. ఓవర్ లోడ్ తో ఆటోలలో ప్రయాణీకులను తరలించరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. నంబర్ లేని వాహనాలలో వెళ్లడం, ఆపోజిట్ రూట్ లో పోవడం, ర్యాష్ డ్రైవింగ్ , రేసింగ్ లపై కూడా పక్కాగా చర్యలు ఉంటాయన్నారు.

అమిత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్గా చేసిన వ్యాఖ్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె. రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ మాట్లాడుతూ “పదేపదే అంబేద్కర్ అని ఎందుకంటారు? అంబేద్కర్కు బదులు ఏ హిందూ దేవుడినైనా తలచుకుంటే స్వర్గానికి వెళ్తారు” అని వ్యాఖ్యానించడం దుర్మార్గం. అమితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరుస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలనే దురుద్దేశ్యంతో మోడీ, అమిల్షాల నేతృత్వంలో మతవాదాన్ని నెత్తికెత్తుకుని బిజెపి పాలకులు వ్యవహరిస్తున్నారు. కేంద్రంలో బిజెపికి స్వంతంగా మెజారిటీ రాకపోవడంతో తటపటాయిస్తున్నారు. అంతేకాకుండా జమిలీ ఎన్నికల పేరుతో ఫెడరల్ స్పూర్తికి తూట్లుపొడుస్తున్నారు. రాష్ట్రాల హక్కులను హరించి కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని తీసుకువచ్చేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను కించపరచిన అమితా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లౌకిక, ప్రజాతంత్ర వాదులంతా ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరుతున్నాం.

శుక్రవారం మాలకొండ లక్ష్మీనరసింహస్వామి హుండీలు లెక్కింపు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీలోని మాలకొండ లో కొలువు దీరి ఉన్న పవిత్రపుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నకు సంబందించిన హుండీ లు నిండినందున (20-12–2024) న శుక్రవారం హుండీ లు లెక్కింపు నిర్వహించనున్నట్లు ఉపకమీషనర్, ఆలయకార్యనిర్వాహణాధికారి కె. వి. సాగర్ బాబు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 14 వారములకు సంబందించిన హుండీలు నిండినందున శుక్రవారం మాలకొండ పైన ఉన్న కళ్యాణమండపం నందు ఉదయం 08.30గంటలకు హుండీలు తెరిసి లెక్కించడం జరుగుతుందని ఉపకమీషనర్, ఆలయకార్యనిర్వాహణాధికారి కె.వి. సాగర్ బాబు తెలియజేశారు.

అదాని గ్రూప్ సిమెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

ప్రమాద బాధితులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర -అనంతపురం : యాడికి మండలంలోని బోయరెడ్డిపల్లి గ్రామం వద్దనున్న అదాని గ్రూప్ సిమెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం 6:30 నుంచి 7:00 మధ్యలో బోయరెడ్డిపల్లి గ్రామం వద్దనున్న అదాని గ్రూప్ సిమెంట్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరగగా, అందులో గాయపడిన 4 బాధితులను నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, బుధవారం రాత్రి అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రిలో ప్రమాద బాధితులను శివ్ నారాయణ్ శర్మ, జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి), జిల్లా ఎస్పీ పి.జగదీష్, తదితరులు పరామర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి) మాట్లాడుతూ కార్మికులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని, చికిత్స గురించి ఎలాంటి ఆందోళన వద్దని, యాజమాన్యం, ప్రభుత్వం నుంచి చికిత్సకు అయ్యే ఖర్చు భరించి ఉత్తమ చికిత్స అందిస్తామని వారికి ధైర్యం అందించారు. ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే నేరుగా తమని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రమాదం ఎలా జరిగింది, తదితర వివరాలను జిల్లా కలెక్టర్ (ఎఫ్.ఏ.సి), జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని బెంగళూరుకి తరలించి వారికి ఉత్తమ చికిత్స అందించేలా అవసరమైన చర్యలు వెంటనే తీసుకుంటామని తెలిపారు. గాయపడిన నలుగురిని ప్రత్యేక అంబులెన్స్ లలో బెంగుళూరుకు తరలించారు. అంబులెన్స్ లలో టెక్నికల్ మెడికల్ టీంలు, రెవెన్యూ సిబ్బందిని వెంట పంపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డిఓ కేశవ నాయుడు, యాడికి తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

డాలర్‌తో పోలిస్తే దారుణంగా పతనమైన రూపాయి విలువ

రూపాయి మారకం విలువ నేడు దారుణంగా క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే తొలిసారి 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బీపీఎస్‌ను తగ్గించడం, 2025 నాటికి మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది. బలహీన మూలధన ప్రవాహాలకు తోడు ఇతర ఆర్థిక సవాళ్ల కారణంగా ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న కరెన్సీపై ఇది అదనపు భారాన్ని మోపింది.డాలర్‌తో పోలిస్తే బుధవారం రూపాయి మారకం విలువ రూ. 84.9525కు పడిపోగా, గురువారం మరింత క్షీణించి రూ. 85.0650కు దిగజారింది. రెండు నెలల్లోనే రూపాయి మారకం విలువ రూ. 84 నుంచి 85కు పడిపోవడం గమనార్హం. అదే సమయంలో రూ. 83 నుంచి రూ. 84కు క్షీణించడానికి 14 నెలల సమయం పట్టింది. అంతకుముందు రూ. 82 నుంచి రూ. 83కు పతనం కావడానికి 10 నెలల సమయం పట్టగా, ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే రూ. 84 నుంచి రూ. 85కు పడిపోయింది.అయితే, భారత కరెన్సీ ఒక్కటే కాదు, ఇతర దేశాల కరెన్సీ కూడా భారీగా క్షీణించింది. ఆసియా దేశాల కరెన్సీ కూడా గురువారం భారీగా పతనమైంది. కొరియన్ వొన్, మలేసియా రిగ్గిట్, ఇండోనేషియన్ రుపయా 0.8 శాతం నుంచి 1.2 శాతం క్షీణించింది.

బుడగ జంగాల జానపద క‌ళ‌కే ఆయ‌న బ‌ల‌గం .. మొగిలయ్య మృతికి రేవంత్ సంతాపం

0

తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం ాశారద కథల్ణకు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య గారి మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన పస్తం మొగిలయ్య శారద తంబుర మీటుతూ, పక్కనే బుర్ర (డక్కీ) వాయిస్తూ వారి సతీమణి కొమురమ్మ పలు చోట్ల ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివని, తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన నిబలగంు సినిమా చివర్లో వచ్చే మొగిలయ్య గారి పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని గుర్తుచేశారు. ఈ బాధాకర సమయంలో పస్తం మొగిలయ్య సతీమణి కొమురమ్మ తో పాటు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భారీగా పతనమైన ఇరాన్ కరెన్సీ

డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ 7.77 లక్షల రియాల్స్‌కు పడిపోయినట్లు వ్యాపారుల వెల్లడి
ఇరానియన్ రియాల్ భారీ స్థాయిలో పతనమవుతోంది. ఓ పక్క పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇరాక్ తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటుండగా, మరో పక్క కరెన్సీ కష్టాలు మరింత ముదురుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఇరానియన్ రియాల్ మరింత పడిపోవడం ఆ దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. డాలరుతో పోలిస్తే మారకపు విలువ ఈ నెలలోనే దాదాపు పది శాతం పడిపోయింది. 2015లో శక్తిమంతమైన దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకున్న సమయంలో డాలరు మారకపు విలువ 32 వేలుగా ఉండగా, ఇబ్రహీం రైసీ మరణం తర్వాత ఈ ఏడాది జులైలో అధ్యక్షుడిగా మసౌద్ పెజెష్కియాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత క్షీణించింది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన రోజు డాలరుతో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ 7.03 లక్షల రియాల్స్‌కు పతనమయింది. ప్రస్తుతం అది 7.77 లక్షల రియాల్స్‌కు పడిపోయినట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.