వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదయింది. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టాభిపురం పీఎస్ వద్ద అంబటి, ఇతర నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో నేడు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు వెళ్తుందని, ఆ తర్వాత కోస్తా తీరం వెంబడి కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో భారీ వర్షాలతోపాటు తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉందని, కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
ఈ జిల్లాల్లో నేడు వర్షాలు
అల్పపీడన ప్రభావంతో నేడు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.
నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కాగా, వాతావరణ మార్పుల కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో, అక్కడ తీరం దాటాల్సినవి మన రాష్ట్రంలో దాటుతున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ నెలాఖరున అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఘనంగా జరిగిన ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల పెన్షన్స్ డే. అధ్యక్షులు చలపతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో విశ్రాంతి ఉద్యోగుల దినోత్సవం (పెన్షనర్స్ డే) అధ్యక్షులు చలపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్న రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఏటిఓ పద్మనాభం, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ సందీప్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు శంకరనారాయణ, ఐ సి ఐ సి ఐ బ్యాంక్ మేనేజర్ నిగోల్, కొత్తపేట ఆంధ్ర ప్రగతి బ్యాంకు మేనేజర్ సువర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ పదవి విరమణ తర్వాత మంచి ప్రశాంతతతో, మనశ్శాంతితో జీవించినప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుందని తెలిపారు. పెన్షన్ల యొక్క సమస్యలను పరిష్కరించుటలో ఐక్యమత్యంగా ఉన్నప్పుడే అన్ని సాధ్యపడుతాయని తెలిపారు. పెన్షనర్ల సమస్యలపై ప్రతినెల నిర్వహించే సమావేశంలో అందరూ తప్పక హాజరై, చర్చించాలని తెలిపారు. బ్యాంకు ద్వారా అవసరమయ్యే సేవలను తప్పక అందిస్తామని తెలిపారు. పెన్షన్ దారులకు ట్రెజరీ కార్యాలయంలో కావలసిన సహాయ సహకారాలను తప్పక అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ విషయంలో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏమాత్రం పొరపాటు జరిగిన ధన నష్టం జరుగుతుందని తెలిపారు. మీ బ్యాంకు ఖాతా నెంబర్ కానీ, పాస్వర్డ్ గానీ, ఏటీఎం వివరాలు గానీ తెలపరాదని తెలిపారు. అనంతరం పదిమంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులైన పోతిరెడ్డి, గోవిందరెడ్డి, సరోజినీ, సదాశివరెడ్డి, కంబగిరి ,శివయ్య, నాగరాజు, శ్రీనివాసులు, యజ్జన్న, రామిరెడ్డి లను విశ్రాంతి ఉద్యోగుల సంఘం వారు శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి నర్సిరెడ్డి, కోశాధికారి సుధాకర్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వము యొక్క ముఖ్య లక్ష్యం..
ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యము అని ఎన్ డి ఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ,జిల్లా ఎంప్లాయిమెంట్ శిడాప్ సంయుక్త చైర్మన్ దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగానే ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ జాబ్ మేళా కి మూడు కంపెనీ ప్రతినిధులు హాజరు కావడం జరిగిందని, ఇంటర్వ్యూలు కూడా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళాలోకు సుమారు 41 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా అందులో 18 మంది వివిధ కంపెనీలకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జేవి సురేష్ బాబు, నైపుణ్యాభివృద్ధి ప్లేస్మెంట్ అధికారి తేజ కుమార్, సిడాపు డిపిటిఎమ్ నారాయణ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, సిడాపు సిబ్బంది, ఎంప్లాయ్మెంట్ అధికారులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శిక్షణ తరగతుల నిర్వహణ ఎంతో సంతృప్తిని ఇచ్చింది..
శ్రీకాళహస్తి ఈటిసి వైస్ ప్రిన్సిపాల్, అబ్జర్వర్ రూపారాణి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ తరగతుల నిర్వహణ నాకెంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చిందని శ్రీకాళహస్తి ఈటిసి వైస్ ప్రిన్సిపాల్, అబ్జర్వర్ రూపారాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు రెండవ రోజు నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులను ఆకస్మికంగా వారు తనిఖీ టీం అంశాలపై శిక్షార్తులను పలు ప్రశ్నలు వేయగా, సరి అయిన సమాధానాలు రావడంతో వారు సంతోషించారు. అంతేకాకుండా ప్రతి అంశముపై వారికి ఎంత మాత్రం అర్థం అయింది అన్న విషయాలపై కూడా ఆరా తీయడంలో సంతృప్తి చెందారు. వచ్చే 2025-26 సంవత్సరం నాటికి మన ధర్మవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నేషనల్ లెవెల్ లో పంచాయితీ అవార్డు పొందడానికి సంకల్పించడం, మీ కృషి ఎంతో స్లాగనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయి మనోహర్ తో పాటు, శిక్షార్తులు తదితరులు పాల్గొన్నారు.
SSC మోడల్ పేపర్ పుస్తకాల ఆవిష్కరణ..
యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్ర రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించే పదవ తరగతి మోడల్ పేపర్లను మండల రిసోర్స్ సెంటర్ , ధర్మవరం నందు మండల విద్యాధికారులు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ , యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రా రెడ్డితో కలసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారులు గారు మాట్లాడుతూ యుటిఎఫ్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది మోడల్ పేపర్ల ప్రచురణ నిర్వహిస్తున్నదని, మోడల్ పేపర్ల రూపకల్పనలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రూపొందించబడి అతి తక్కువ ధరకు తెలుగు ,ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు ఉండే విధంగా, 100 రోజుల ప్రణాళికకు అనుకూలంగా తయారుచేసి అందించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ మోడల్ పేపర్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడటంతో పాటు మంచి ఉత్తీర్ణత సాధించగలిగే సత్తా, ధైర్యం వస్తుందన్నారు.యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ మోడల్ పేపర్ నుంచి ప్రతి ఏడాది 70 నుంచి 80 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయని, ఈ మోడల్ పేపర్ గ్రామీణ విద్యార్థుల శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.మునిసిపల్ బాలికోన్నత పాఠశాల, కొత్తపేట ప్రధానోపాధ్యాయురాలు మేరి వరకుమారి మాట్లాడుతూ గత సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో యుటిఎఫ్ రూపొందించిన మోడల్ పేపర్లలోని ప్రశ్నలు 80 శాతము పైగా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ ఏడాది కూడా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించుటకు ఈ మోడల్ పేపర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ధర్మవరం పట్టణ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ, సాయి గణేష్, సీనియర్ నాయకులు రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, లతా దేవి, నాగేంద్రమ్మ, వీరనారాయణమ్మ, విజయలక్ష్మి, రామాంజనేయులు, మోహద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ..
శ్రీ సత్య సాయి సేవ సమితి
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రస్తుతం జిల్లాలో చలి అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధులతోపాటు చిన్న పిల్లలు, ఆస్మా వ్యాధిగ్రస్తులు కూడా పలు ఇబ్బందులకు గురికావడంతో పాటు వైద్యుల సలహాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి అన్నీ ఉన్న వ్యక్తులకు వారే అన్ని ఏర్పాటు చేసుకుంటారు. మరి ఏమీ లేని నిరాశ్రయులు అనగా రైల్వేటేషన్, బస్ స్టేషన్, దేవాలయాల వద్ద, వివిధ కళ్యాణ మండపాల వద్ద ఆరుబయట చలికి వణుకుతూ, బ్రతుకు జీవుడా అంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి నిరాశ్రయులకు పట్టణంలోని గాంధీ నగర్ లో గల శ్రీ సత్య సాయి సేవ సమితి వారు పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారములతో దాదాపు 60 మందికి పైగా దుప్పట్లను పంపిణీ చేశారు. సత్యసాయి సేవా సమితి వారు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అన్న సూక్తితో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, పేదలను ఆదుకొనుట, అనాధలకు, నిరాశ్రయులకు భోజనంతోపాటు ఇటువంటి దుప్పట్లు పంపిణీ చేయడం మాకెంతో సంతోషాన్ని తృప్తిని ఇచ్చిందని వారు తెలిపారు. అనంతరం అనాధలు నిరాశ్రయులు శ్రీ సత్య సాయి సేవ సమితి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నవ జ్యోతుల మహోత్సవ వేడుకలు
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని తొగట వీధిలో గల శాంత కళ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో జనవరి 14వ తేదీ మంగళవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు భక్తాదులు తెచ్చిన పాలతో స్వయంగా అమ్మవారికి పాలాభిషేకం నిర్వహిస్తామని ఆలయ అభివృద్ధి సంఘం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనంతరం దేవాలయమునందు తొగట వీధి నందు భక్తాదుల సహాయ సహకారములతో నరసాపురం గ్రామ బృందం నవజ్యోతి ల మహోత్సవం కూడా రాత్రి రెండు గంటల నుంచి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ జ్యోతుల కార్యక్రమంలో అధిక సంఖ్యలో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు.
ఒకే జిల్లా-ఒకే ఉత్పత్తియే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం..
ఢిల్లీ నిపుణులు ఆర్షితిగుప్తా, జాస్మిన్ కౌర్
విశాలాంధ్ర ధర్మవరం;; ఒకే జిల్లా-ఒకే ఉత్పత్తియే కేంద్ర ప్రభుత్వము యొక్క లక్ష్యము అని ఢిల్లీ నిపుణులు అర్చిథి గుప్తా, జాస్మైన్ కౌర్ తెలిపారు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టుచీరలకు అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ధర్మవరంలో చీరల నిర్వహణ, తయారీపై పట్టణంలో ఈ నిపుణుల కమిటీ పరిశీలన చేయడం జరిగింది. తదుపరి పట్టు గ్రుడ్డు నుంచి పట్టుచీర తయారీ వరకు అన్ని దశలను వారికి చేనేత తయారీదారులు చూపించి, వాటిని విశదీకరించడం జరిగింది. మొత్తం మీద వారి పరిశీలనలో ధర్మవరం పట్టుచీరలకు అవార్డు వచ్చే అవకాశాలు గల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్ ఏడీ. రామకృష్ణ, డివో. రమణ రెడ్డి, శీనా నాయక్, సిరికల్చర్ అధికారులు, డిజైనర్ నాగరాజు, బిజెపి నాయకులు జింక చంద్రశేఖర్, చేనేత కార్మికులు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
–పరగొండ జోజన్న
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైనట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అండ్ బాబు జగజీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా జిల్లా అధ్యక్షులు పరగొండ జోజన్న ఆరోపించారు. బుధవారం స్థానిక ఎస్సీ కాంప్లెక్స్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అండ్ బాబు జగజీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా మండల కమిటీ సమావేశాన్ని కొమ్ము రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పరగొండ జోజన్న పాల్గొని మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం సరిహద్దు నియోజకవర్గమైన ఆలూరు ప్రాంతంలో దళితులు ఎక్కువ వివక్షతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కుల వివక్షత ఉండడం పాలకులు అధికారులు వైఫల్యమేనన్నారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అండ్ బాబు జగజీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా బంగి రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా కొమ్మ రమేష్, ఉపాధ్యక్షుడిగా కాశప్ప గారి దశరథ రామయ్య, సహాయ కార్యదర్శిగా కైరిప్పుల రంగన్న, అలాగే మండల మహిళా కార్యదర్శి బుజ్జమ్మ, సహాయ కార్యదర్శిగా జ్యోతి లతోపాటు 11 మందిని కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పరమేష్, మధు, గుండ్రాల వీరభద్రి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.