Friday, December 27, 2024
Home Blog Page 65

ప్రపంచ ప్రిమెచ్యూరిటీ దినోత్సవం

విశాలాంధ్ర -అనంతపురం : ప్రపంచ ప్రీమెచ్యూరిటీ వారం సందర్భం గా ముఖ్య అతిథి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీదేవి పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నెలలు నిండా కుండా పుట్టిన పిల్లలకు ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అని వివరించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి కి సంబంధించి సూర్యప్రకాష్ సీఈఓ ,ఒపీతోమెట్రిస్ట్ హెడ్ బాలకృష్ణ ప్రేమెటురిటి ఉన్న పిల్లల్లో ఎలాంటి కంటి పరీక్షలు చేయించు కోవాలి అని వివరించారు . అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి త్వరిత చికిత్స కేంద్రము నందు రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా కార్యక్రమ జిల్లా పర్యవేక్షణ అధికారి డాక్టర్ నారాయణస్వామి ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుత్రి కడప వారి సహకారంతో బరువు తక్కువగా పుట్టిన, నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు, మరియు గుండె లోపం, రక్తహీనత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలను సమీకరించి వారికి కంటి రెటీనా పరీక్షలను ఃరెడ్ కామ్ః అనే పరికరంతో స్క్రీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21 మంది పిల్లలను పరీక్షించగా ,అందులో 10 మంది పిల్లలకు సమస్య ఉన్నట్టు గుర్తించారు. వీరిని మరల రెండు వారాల తర్వాత పరీక్షించి రెటీనా మెచ్యూరిటీ పొందకపోతే వీరికి ఉచితంగా చికిత్స చేయించబడును. ఈ కార్యక్రమం డాక్టర్ మానస , డాక్టర్ దివ్య ,చిన్న పిల్లల వైద్య నిపణురాలు డా. శ్రీవిద్య, కంటి పరీక్షా నిపుణురాలు జ్ఞాన ప్రసన్న, మేనేజర్ రజిత, స్టాఫ్ నర్సు మౌనిక , సోషల్ వర్కర్ రాజేశ్వరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు .

శానిటేషన్ వర్కర్లకు నాలుగు నెలల వేతనాలు తక్షణమే విడుదల చేయండి

మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మాణిక్యరావు కు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జే.రాజారెడ్డి వినతులు

విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ లో, మెడికల్ కళాశాలలో పనిచేసే శానిటేషన్ వర్కర్ల కు పెండింగ్ లొ ఉన్న 4నెలల వేతనాలు తక్షణమే విడుదల చేయాలని హాస్పిటల్ సూపర్డెంట్ కె.ఎస్. ఎస్. వెంకటేశ్వరరావు ,మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాణిక్యరావు కి ఏపీ మెడికల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జే.రాజారెడ్డి ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు రోగుల మధ్య తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తూ ఉంటారన్నారు. ఇటువంటి కార్మికులకు జీతాలను పెండింగ్లో పెట్టడం సిగ్గుచేటు అన్నారు. బకాయి వేతనాలు చెల్లించకుంటే ఆందోళన చేయాల్సివస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు జి.చిరంజీవి,వికే కృష్ణుడు, ఏపీ మెడికల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మనోహర్,జిల్లా నాయకులు వెంకటేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

చక్కటి కంటిచూపుతోనే మెరుగైన విద్య లభిస్తుంది..

కంటి వైద్య నిపుణులు, రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ ఎస్. నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; చక్కటి కంటిచూపుతోనే మెరుగైన విద్య లభిస్తుందని కంటి వైద్య నిపుణులు రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ ఎస్. నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని జీవనజ్యోతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్థులకు”జాతీయ హ్రస్వ దృష్టి వారోత్సవాలు” ముగింపు కార్యక్రమంను పురస్కరించుకొని కంటి చూపు సమస్యలు వాటి పరిష్కారం పై పలు విషయాలను పాఠశాల ప్రార్థన సమయంలో తెలియజేశారు. అదేవిధంగా కంటిని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కంటికి భద్రత ఎలా ఇవ్వాలి అన్న విషయాన్ని విశదీకరించారు. అనంతరం డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులందరికీ కంటి చూపు సక్రమంగా ఉంటే చక్కటి విద్య లభిస్తుందని, అప్పుడే ఉత్తమ పరీక్ష ఫలితాలు లభించే అవకాశం ఉన్నాయని తెలిపారు. ప్రతి తరగతి లోని ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల యొక్క కంటి చూపు పై శ్రద్ధను కనపరచాలన్నారు. ఇందుకు తల్లిదండ్రులు కూడా సమిష్టిగా తమ పిల్లల పట్ల తప్పనిసరిగా శ్రద్ధను చూపాలని తెలిపారు. తదుపరి విద్యార్థుల యొక్క దృష్టి లోపాలను గుర్తించి కంటి డాక్టర్ సలహాతో వైద్య చికిత్సలు చేయించి కంటి అద్దాలను ఉపయోగించాలని తెలిపారు. నా కూతురు అయిన మధు బిందు, పూర్వ విద్యార్థి చంద్రశేఖర్ రెడ్డి తాము చదువుకున్న జీవన్ జ్యోతి లో ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందించదగ్గ విషయమని వారు తెలిపారు. చదువులో బాగా రాణించాలి అంటే చక్కటి కంటిచూపు ఎంతో అవసరమని, టీవీ, సెల్ ఫోన్ లకు పూర్తిగా దూరంగా ఉండాలని తెలిపారు. ఇవి అలవాటు పడితే చదువులో కూడా వెనుక పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు ఎవరైనా కంటికి దగ్గరగా పెట్టుకుని చదువుతూ ఉంటే దృష్టిలోపముగా గుర్తించవలెనని తెలిపారు. అదేవిధంగా తరగతి గదిలో నల్ల బోర్డు పై రాసిన అక్షరాలు కనపడని వారు కూడా దృష్టిలోపం ఉన్న వారిగా గుర్తించాలని తెలిపారు. కంటి చూపు పట్టిక ద్వారా కూడా కంటి దోషమును గుర్తించవచ్చునని తెలిపారు. అనంతరం పాఠశాల లోని 170 మంది విద్యార్థిని విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలను నిర్వహించి వారి వారి యొక్క దృష్టిలోపమును తెలియజేయడం జరిగిందన్నారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. చిన్నారులకు ఆట వస్తువులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సుజాత, కర్రీస్పాండెంట్ రెన్సి, పూర్వపు విద్యార్థి, ఎంటోడు ఫార్మా సిటికల్ లిమిటెడ్ మెడికల్ రిప్రజెంటేటివ్ చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, బోధ నేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు..

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం : గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని గ్రంథాలయ అధికారిని సౌభాగ్యవతి అంజలి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయ శాఖలో చివరి రోజు బుధవారం వివిధ పోటీలలో పాల్గొని విజేతలైన వారందరికీ బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువర్స్ ఫౌండేషన్ బండ్లపల్లి రంగనాథ్, ఎల్ఐసి నాగరాజ్, హెడ్మాస్టర్ కవిత, కలవల శ్రీరామ్ పాల్గొన్నారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి, ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రంథాలయమును వయస్సుతో నిమిత్తం లేకుండా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. చదువుతోపాటు నిరుద్యోగులకు కావలసిన అన్ని స్టడీ మెటీరియల్ కూడా లభ్యమవుతాయని తెలిపారు. అంతేకాకుండా గ్రంథాలయ సభ్యత్వమును ఉచితంగా పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులతో పాటు నిరుద్యోగులు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ వారోత్సవాలకు సహకరించిన వారందరికీ పేరుపేరునా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్ లతోపాటు అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.

జాతీయ వాలీబాల్ స్థాయికి ఎంపికైన మున్సిపల్ విద్యార్థులు… హెడ్మాస్టర్ పద్మజ

విశాలాంధ్ర ధర్మవరం : జాతీయ వాలీబాల్ స్థాయి పోటీలకు పట్టణంలోని కొత్తపేటలో గల ఎస్పీసీఎస్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ పద్మజ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీయందు మా విద్యార్థులు ప్రతిభను ఘనపరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో ఎస్. చరణ్ కుమార్ యు. పుష్పాంజయ్ ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థులు డిసెంబర్ 6 నుండి 8 వరకు జరుగు పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ తో పాటు, ఎంఈఓ రాజేశ్వరి దేవి,టీచర్ ఆదినారాయణ, భాస్కర్, పీఈటి పద్మాబాయి,ఉపాధ్యాయ బృందం, బోధ నేతర బృందం, పాఠశాల విద్యార్థులు,తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని పంపిణీ చేయాలి.. ఆర్డిఓ మహేష్

విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులందరికీ విధిగా పంపిణీ చేయాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని శివానగర్లో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి తరగతుల యొక్క గదులను, మరుగుదొడ్లను, వంటగదిని వారు పరిశీలించి, పరిశుభ్రతంగా ఉండే విధంగా చూడాలని హెడ్మాస్టర్ లక్ష్మీనారాయణకు సూచించారు. తదుపరి నిర్మాణం లో ఉన్న గదులను కూడా వారు పరిశీలించారు. ఉపాధ్యాయుల అటెండెన్స్ లను, మధ్యాహ్న భోజన రిజిస్టర్లను వారు పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన చదువును ఉపాధ్యాయులు అందరూ కూడా సమన్వయంతో బోధించాలని తెలిపారు. విద్యార్థులకు మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని, విద్యార్థులను తమ కన్న బిడ్డల లాగా చూసుకోవాలని తెలిపారు. ఎక్కడ ఎటువంటి తప్పిదాలు జరిగిన సహించేది లేదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం. లక్ష్మీనారాయణ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రీ సర్వేలో అందరికీ న్యాయం జరుగుతుంది.. ఆర్డీవో మహేష్

విశాలాంధ్ర ధర్మవరం:: రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రతి గ్రామములో నిర్వహించబడే రీ సర్వేలో అందరికీ తప్పక న్యాయం చేకూర్చుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని తుమ్మలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక లోని గ్రామసభను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, షెడ్యూల్ తేదీల ప్రకారం పరిష్కరించబడుతుందని తెలిపారు. తదుపరి కొంతమంది రైతులు తమ సమస్యలను విన్నవించుకున్నారు
ఏ సమస్య అయినా కూడా సచివాలయంలో ఇవ్వాలని వారు తెలిపారు. తదుపరి తుమ్మల లోని సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోని అన్ని రికార్డులను వారు పరిశీలిస్తూ, ఉద్యోగుల అటెండెన్స్ లను తనిఖీ చేస్తూ సమయపాలనలో తేడా రాకూడదని వారు హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూమెంట్ రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. ఉద్యోగులందరూ కూడా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే గ్రామ ప్రజల సమస్యలు సులభతరంగా పరిష్కారం అవుతాయని వారు సూచించారు. విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సురేష్ బాబు, వీఆర్వో ప్రసాద్ ,గ్రామ సర్వేయర్ వాణి, సచివాలయ ఉద్యోగులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వీఆర్వో గిరిధర్ రెడ్డి పై చర్యలు గైకొనండి ..బాధితుల ఆవేదన

.విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్వో గిరిధర్ రెడ్డి పై చర్యలు గైకొనాలని బాధితులు వాపోయారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మండల పరిధిలోని పోతుకుంట గ్రామానికి చెందిన మహిళ రైతు శ్రీ లత తన బాధను వ్యక్తం చేసింది. నా భూమి కి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను వీఆర్వో బీరువాలో పెట్టుకుని నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నాడని తెలిపింది. అంతకుమునుపే వీఆర్వో ఓ రైతు గొడవ పడుతుండగా, మధ్యలో జోక్యం చేసుకొని నా విషయంలో కూడా వీఆర్వో పనిచేయటం లేదని, బాహాటంగా మూడు లక్షల రూపాయలు లంచం ఇస్తేనే పని చేస్తారని తెలిపాడని ఆమె వాపోయింది. దీంతో ఆవరణంలో ఉన్న ఓ వ్యక్తి ఆ గొడవ దృశ్యాన్ని సెల్ ద్వారా తీసి సోషల్ మీడియాకు పంపడంతో అది వైరల్ గా కొనసాగింది. దీంతో ఆర్డీవో మహేష్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో సురేష్ బాబు వీఆర్వో అయిన గిరిధర్ రెడ్డి పై విచారణ జరిపి, నివేదికను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.

ఘనంగా దీపారాధన.. దర్గా కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల ఖాద్రి రోజా ఏ ముబారక్, ధర్మవరం శ్రీ హజరత్ సయ్యద్ మహమ్మద్ షా ఖాదర్ వలీ రహమతుల అలై వారి 98వ ఊరుసే షరీఫ్ వేడుకలు ఈనెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఘనంగా దర్గా కమిటీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మూడవరోజు దీపారాధన ఫతేహా కానీ, జియారత్ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మత పెద్దలు దర్గాలోని సమాధులకు ప్రత్యేక పూజలు, చదివింపులు నిర్వహించారు. ప్రతి సంవత్సరము జరిగే ఈ ఉరుసు భక్తాదులు, దాతల సహాయ సహకారములతో హిందూ మహమ్మదీయ సోదరి సోదరుల సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని కమిటీ వారు తెలిపారు. ఈ ఉరుసు కార్యక్రమానికి విరాళాలు అందించిన వారికి, సహాయ సహకారాలను అందజేస్తూ సేవలు అందించిన వారందరికీ పేరుపేరునా దర్గా కమిటీ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్త వాల్ ఖాజా హుస్సేన్, సోలిగాల్ల చిన్న వెంకటేశులు, మహబూబ్ అలీ, హైదర్ వలీ, సబ్జాన్, వెల్దుర్తి బాబా ఫక్రుద్దీన్, ముక్తియార్, దర్గా ముజావర్ ఖాద్రీ నవాజ్, షఫీక్, సభ్యులు రోషన్ జమీర్,తాహిర్ ,బాబావాలి, నూర్ మొహమ్మద్, జబీబుల్లా, హాజీవలి, ఆల్ హజ్ కాజా హుస్సేన్, మహబూబ్ వలీ, ఖాదర్ వలీ, అజ్జు, షాషావలి, తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీలు తగ్గించేంతవరకు సిపిఐ ఉద్యమ కార్యాచరణ

సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం : సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించేవరకు సిపిఐ ఇతర వామపక్ష పార్టీలు కలిసి ఉద్యమ కార్యాచరణ రూపుదిద్దుకుంటున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ప్రధాని మోడీకి లొంగిపోయి, అదానితో లాలూచీపడి ప్రజలపై భారం వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే 6,072 కోట్లు వసూలు చేసేందుకు చార్జీలు పెంచి డిసెంబర్ నెల నుంచి వసూల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతోందన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిపాదనతో మరో 11,820 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపడానికి పూనుకుంటున్నారు అని పేర్కొన్నారు. ప్రజా సంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలు అభ్యంతరాలు తెలియజేసినప్పటికీ విద్యుత్ చార్జీలు పెంచడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు హామీలు గాలికొదిలి కరెంట్ చార్జీలు పెంచమని చెప్పి కరెంట్ చార్జీలు పెంచబోతున్నారు అని తెలిపారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నారన్నారు. గోరుచుట్టు పై రోకటి పోటులాగా గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు. బుధవారం నుండి ఈనెల 30 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యం చేస్తూ సభలు ,సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్లో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వామపక్ష పార్టీలు మద్దతు తెలిపారు అన్నారు. ప్రజలపై భారం వేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని భారతకమ్యూనిస్టు పార్టీ, సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు.