మంబట్టు (ఏపీ): భారతదేశంలోని ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) తయారీదారులలో ఒకరైన ఈ
ప్యాక్ ప్రిఫ్యాబ్ , కేవలం 150 గంటల రికార్డు సమయంలో భారతదేశపు అత్యంత వేగవంతమైన నిర్మాణాన్ని చేయటం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మంబట్టులో పూర్తయిన ఈ ప్రాజెక్ట్, వినూత్నమైన, వేగవంతమైన నిర్మాణం పట్ల ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ నిబద్ధతకు నిదర్శనం. మొత్తం 151,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం పూర్తిగా అధునాతన ప్రిఫ్యాబ్రికేషన్, పీఈబీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడిరది. ఈ ప్యాక్ ప్రిఫ్యాబ్ వేగవంతమైన పురోగతిని సాధించడానికి ప్రతి దశ నిర్మాణాన్ని నిశితంగా ప్లాన్ చేసింది. ప్రాథమిక నిర్మాణం 48వ గంటకు పూర్తయింది, ఆ తర్వాత 90వ గంటకు రూఫింగ్ చేయబడిరది మరియు 120వ గంటకు క్లాడిరగ్ చేయబడిరది, నిర్ణీత కాలక్రమంలో పూర్తిగా పనిచేసే భవనం తీర్చిదిద్దబడిరది.
ఈప్యాక్ ప్రి ఫ్యాబ్ నూతన ప్రమాణాలు
హింద్వేర్ వారి ‘’బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’ కార్యక్రమం
ముంబయి: భారతదేశపు ప్రముఖ బాత్వేర్ బ్రాండ్ హింద్వేర్ లిమిటెడ్ వారు తమ ‘‘బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’’ కార్యక్రమం ద్వారా యువతులను శక్తివంతం చేయడానికి మరియు వారి కమ్యూనిటీలను ఉద్ధరించడానికి వారి మిషన్ కొనసాగిస్తున్నారు. 2020లో ‘హైజీన్ దట్ ఎంపవర్స్’ సిఎస్‌ఆర్ ప్రయత్నంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ‘డేర్ టు డ్రీమ్’ థీమ్‌తో కొత్త కోణాన్ని తీసుకువచ్చింది. బాలికలు పాఠశాలలో కొనసాగేలా, వారి కలలను నిజం చేసుకొని ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి సురక్షితమైన మరియు అందుబాటులో ఉన్న శానిటేషన్‌ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో తగినంత శానిటేషన్ సౌకర్యాలు లేకపోవడం ఒక క్లిష్టమైన సమస్యగా ఉంది. పరిశుభ్రమైన, హైజీనిక్ పారిశుద్ధ్య సౌకర్యాలకు అందించడానికి హింద్వేర్ ‘బిల్డ్ ఎ టాయిలెట్, బిల్డ్ హర్ ఫ్యూచర్’ కార్యక్రమంలో భాగంగా పుణెకు చెందిన ఎన్జీవో మానస్ ఫౌండేషన్, స్థానిక కమ్యూనిటీలతో చేతులు కలిపింది.
‘మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్’ ఆవిష్కరణ
ముంబై: మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ (ఎంఓఎంఎఫ్) తన సరికొత్త ఫండ్ ఆఫర్ ‘మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్’ను ప్రారంభించింది. భారతదేశంలో క్యాపిటల్ మార్కెట్ థీమ్ కింద జాబితా చేయబడిన స్టాక్స్ వృద్ధి సామర్థ్యాన్ని ఈ ఫండ్ అందిస్తుంది. నిఫ్టీ 500లో భాగమైన 15 కంపెనీలు కూడా ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌ఓ పీరియడ్‌ను 26 నవంబర్ 2024 నుండి 10 డిసెంబర్ 2024 వరకు నిర్ధారించారు. ట్రాకింగ్ దోషానికి లోబడి నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ టోటల్ రిటర్న్ ఇండెక్స్ సూచించిన సెక్యూరిటీల మొత్తం రాబడులకు అనుగుణంగా ఖర్చులకు ముందు రాబడులను అందించడమే ఈ పథకం పెట్టుబడి లక్ష్యం. అయితే, ఈ పథకం పెట్టుబడి లక్ష్యం నెరవేరుతుందనే గ్యారంటీ లేదా హామీ లేదని మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ లిమిటెడ్ బిజినెస్ పాసివ్ ఫండ్స్ చీఫ్ ప్రతీక్ ఓస్వాల్ తెలిపారు.
సరికొత్త బ్యాటరీ టెక్నాలజీతో తొలి ఆల్-టెర్రైన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదల
హైదరాబాద్: గ్రావ్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫుల్-స్టాక్ కంపెనీ, సస్టైనబుల్ మొబిలిటీలో అగ్రగామిగా ఉంది, హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ క్వాంటాను విడుదల చేసింది. క్వాంటా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ.1.2లీ. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడినది, ఇది వాణిజ్యపరమైన ఉపయోగం కోసం సిద్ధంగా ఉంది, క్వాంటా హైదరాబాద్‌లోని చెర్లపల్లిలోని గ్రావ్‌టన్ అత్యాధునిక సౌకర్యంలో రూపొందించి, తయారు చేయబడిరది. భారతదేశంలో లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను అనుసంధానం చేసిన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ క్వాంటా. ఈ పురోగతి ఆవిష్కరణ మెరుగైన బ్యాటరీ జీవితం, ఉన్నతమైన ఉష్ణ స్థిరత్వం, విస్తరించిన శ్రేణిని నిర్ధారిస్తుంది, పట్టణ ప్రయాణికులు మరియు సాహస ఔత్సాహికుల కోసం క్వాంటాను నమ్మదగిన, సమర్థవంతమైన ఎంపికగా చేస్తుంది.
సామ్యవాద,లౌకిక పదాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం
సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్
విశాలాంధ్ర – అనంతపురం : సామ్యవాద,లౌకిక పదాలు తొలగించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ వ్యక్తం చేస్తూ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 75 వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇటువంటి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడం అభినందనీయమన్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులు అమలు ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా పీటికలో సామ్యవాద, లౌకిక పదాలను అదనంగా చేర్చడం జరిగిందన్నారు. 1976 లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన అంశాలను ఆమోదం తెలిపింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చి లౌకిక, సామ్యవాద పదాలను సమర్థించిందన్నారు. లౌకిక సామ్యవాద పదాలపై అభ్యంతరాలు తెలుపుతూ బిజెపి రాజ్యసభ మాజీ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి, బిజెపి అశ్విన్ ఉపాధ్యాయ, బలరాం సింగ్ విడివిడిగా పిటీషన్లు దాఖలు చేశారన్నారు. ఈ పిటిషన్ లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్న, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఈనెల 22న రిజర్వ్ ఉంచిన తీర్పును సోమవారం తోసి పుచ్చుతూ కీలకతీర్పు ను వెలవరించిందన్నారు. ఈ తీర్పుపై సిపిఐ జిల్లా సమితి మద్దతు పలుకుతోందన్నారు.
డాక్టర్ హేమలతకు జాతీయ స్థాయి అవార్డు
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆర్.ఎం.ఓ(రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్) డాక్టర్ జి.హేమలత జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ స్థాయి అవార్డుకు డాక్టర్ హేమలతను ఎంపిక చేశారు. ఈ మేరకు ఐఎంఏ సెక్రెటరీ డాక్టర్ అనిల్ కుమార్ జె నాయక్ మంగళవారం ప్రకటించారు.
డిసెంబర్ 27న హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగే నేషనల్ కాన్ఫరెన్స్ – ఉత్సవ్-2024 వేదికపై ఆమె ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.వి.అశోకన్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ హేమలత.జి. విధి నిర్వహణలో నీతి, నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఆస్పత్రి అభివృద్ధితో పాటు రోగులు, వారి సహాయకుల కోణంలో ఆలోచిస్తూ మెరుగైన సేవలందించేందుకు పరితపిస్తారు.
ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారంతా పేద, మధ్య తరగతి వర్గాల వారే కావడంతో వారికి ఆస్పత్రిలో సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారి సాదకబాధకాలను మానవీయ కోణంలో ఆలోచించి, వాటి పరిష్కారానికి కృషి చేసారు. చేస్తున్నారు.
ఐఎంఏలోనూ ఇప్పటికే వివిధ హోదాల్లో అందించిన సేవలను గుర్తించిన ఐఎంఏ పెద్దలు జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేయడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.
జాతీయ సాహస శిబిరంలో మెరిసిన మెడికోలు
విశాలాంధ్ర – అనంతపురం : అనంత వైద్య కళాశాల 2023వ బ్యాచ్ కి చెందిన మెడికోలు మచ్చ సాయి సుష్మ శ్రీ, జెన్నీ తానియా, హేమంత్ చౌదరి లు ఈనెల 10 నుంచి 19 వ తారీకు వరకు పది రోజులపాటు హిమాచల్ ప్రదేశ్ లో గల మనాలి లోని అటల్ బిహారీ వాజ్ పేయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ ఎలియడ్ స్పోర్ట్స్ లో భారతదేశ క్రీడా మంత్రిత్వ శాఖ ఆధీనంలోని జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాహస శిబిరానికి వెళ్లి సాహస యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకు వచ్చిన సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు తన చాంబర్లో విద్యార్థులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. మెడికల్ సర్ ప్రిన్సిపల్ ఆచారి డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం పదిమంది విద్యార్థులు మాత్రమే ఎంపికవగా ఇందులో ముగ్గురు మా మెడికల్ కళాశాలకు చెందినవారు కావడం మాకు గర్వకారణంగా ఉందని, ఎన్ఎస్ఎస్ ద్వారా ఇలాంటి సాహస శిబిరాలలో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసం, ధైర్యం, మానసిక వికాసం, భిన్నత్వంలో ఏకత్వం వంటి లక్షణాలు విద్యార్థులలో అలవాడతాయని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రమాదాల బారిన ప్రజలను రక్షించడానికి ఈ శిబిరంలో శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. పది రోజులలో విద్యార్థులు రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్, ట్రిక్కింగ్, రివర్ రాఫ్టింగ్ లాంటి క్రీడలలో శిక్షణను, శిక్షణ పత్రాన్ని తీసుకోవడం విద్యార్థులకు ఒక వరమని తెలిపారు. విద్యార్థులను మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ నవీన్ కుమార్, ఆచార్య డాక్టర్ తెలుగు మధు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు తదితరులు అభినందించారు.
సమ్మిళిత రాజ్యకీయాలే భారత రాజ్యాంగత భావన
కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్ ఏ కోరి
విశాలాంధ్ర – అనంతపురం : సమ్మిళిత రాజ్యకీయాలే భారత రాజ్యాంగత భావన అని కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎస్ ఏ కోరి పేర్కొన్నారు. మంగళవారం
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగం, స్టూడెంట్ సెమినార్ సిరీస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిబంధనలు: వాగ్దానాలు (రాజకీయ) మరియు ప్రజల అనుభవాలు అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ ఏ కోరి మాట్లాడుతూ… ప్రపంచంలో ఎన్నో దేశాలతో సమానమైనటువంటి రాష్ట్రాలు కలిగిన దేశం భారతదేశం అని పార్టీ దేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని లికించిన రాజ్యాంగ సభ సభ్యులు వారి సిద్ధాంతాలు మనకు ఆదర్శాలన్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య జి.రామ్ రెడ్డి మాట్లాడుతూ… భారతదేశ “ప్రజలమైన మేము” మొదలయ్యే రాజ్యాంగ పీఠిక యొక్క విశిష్టతను, ప్రజాస్వామ్య దేశంలో పార్టీల పాత్రను, వీటిని కాపాడటంలో నేటి పౌరుల పాత్రను వివరించారు. డీన్ ఆచార్య షీలా రెడ్డి అందరూ రాజ్యాంగ అంశాలను వాటి అంతరార్ధాన్ని అవగతం చేసుకొని వైవిధ్యమైనటువంటి భారత ప్రజల అవసరాలు, ఆశయాలకు కనుగుణంగా ఉపయోగించుకోవాలన్నారు. సమావేశంలో భాగంగా అందరూ రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేశారు.
సమావేశంలో మొదటి సాంకేతిక సదస్సుకు రాజనీతి శాస్త్ర విభాగ సహప్రాచార్యులు డా. బాబు గోపాల్ అధ్యక్షత వహించగా, అలహాబాద్ లోని జిబిపిఎస్ఎస్ఐ లో సహప్రాచార్యులైన డాక్టర్ చంద్రయ్య గోపాన్ని ముఖ్య కొత్తగా విచ్చేసి ప్రాథమిక హక్కుల విశిష్టతను వివరించారు. రెండవ సాంకేతిక సదస్సుకు అర్థశాస్త్ర విభాగ సహప్రాచార్యులు డా. కేశవరెడ్డి అధ్యక్షత వహించగా, రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయనుంచి డా జీవన్ కుమార్ ముఖ్య వక్తగా మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు మరియు సంక్షేమ విధానం గురించి చర్చించారు. మూడవ సాంకేతిక సభను సహాయచార్యులు డా. సందీప్ నిర్వహించగా, మిజోరాం కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ సుమన్ దమేరా ముఖ్య ప్రసంగాన్ని సమ్మిళిత రాజకీయాలపై ప్రసంగించారు. నాలుగవ సాంకేతిక సదస్సును డాక్టర్ రాజేష్ కోట నిర్వహించగా, హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం నుండి డా. విగేషన్ రాజ్యాంగ విధులు మరియు న్యాయశాఖ బాధ్యతలు అనే అంశంపై విపులంగా చర్చించారు. సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య వి.వి.ఎన్ రాజేంద్రప్రసాద్ విద్యార్థులందరూ రాజ్యాంగ విలువల పట్ల అవగాహన కలిగి భవిష్యత్తు అవసరాలకు ఆచరించే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఆచార్య హనుమాన్ కెనడి ఈ సదస్సును జరిపి రాజ్యాంగ స్వరూపం పై విద్యార్థులకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. రాజనీతి శాస్త్ర విభాగ అధ్యాపకులు
డాక్టర్ దీపాంకర్ డే, రామకృష్ణారెడ్డి, ప్రణతి తదితరులు పాల్గొన్నారు.
జి జి హెచ్ లో క్యాన్సర్ నిర్ధారణ పై ఓపి ప్రారంభం
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నందు క్యాన్సర్ ను త్వరగా నిర్ధారించుటకు రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రత్యేకమైన ఓ.పి ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్యరావు , సూపరింటెండెంట్ డాక్టర్ కె.ఎస్.ఎస్ వెంకటేశ్వర్ రావు , కమ్యూనిటీ మెడిసిన్ నోడల్ ఆఫీసర్, హెచ్ ఓ డి అఫ్ జనరల్ సర్జరీ, గైనిక్, పేథాలజీ, రేడియోతెరప రేడియో డయాగ్నస్టిక్ డెపార్ట్మెంట్స్ మరియు ఆర్ ఎం ఓ లు డాక్టర్ హేమలత ,పద్మజ పాల్గొన్నారు. ఈ ఓ.పి ప్రతి మంగళవారం మరియు గురువారం నందు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు జరుగుతుంది. ఓ.పి నందు రొమ్ము క్యాన్సర్, నోటి యందు క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తించి వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుతున్నారు.
రాజ్యాంగంలోని పీఠిక ఒక పవిత్ర గ్రంథం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగంలోని పీఠిక ఒక పవిత్ర గ్రంథం అని,భారతదేశంలో మనం పుట్టామంటే ఎన్నో జన్మల పుణ్యఫలం,మన తల్లిదండ్రులు చేసిన పుణ్యంతో మనం జన్మించామని అన్నారు.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటించానని భారతదేశంలో 24 రాష్ట్రాలు పర్యటించానని, ఐదు నుండి ఏడు దేశాలను పర్యటించాలని వేరే దేశాలలో పర్యటించినప్పుడు మనం గమనిస్తే వివిధ రకాల ఆంక్షలు ఉంటాయని, అది మన భారతదేశంలో మనం ఎంత స్వేచ్ఛతో, ఆనందంగా ఉన్నామని తెలుస్తుందని అన్నారు. హక్కుల,స్వేచ్ఛగా,ఆనందంగా ఉండ కలిగి మన భారత దేశం అని అన్నారు. దానికి కారణం మన భారతదేశ రాజ్యాంగం అని అదేవిధంగా ఈరోజు రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలను నేరుగా జిల్లా కలెక్టర్ గా ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో ఆ దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడని, ఈ విషయంలో గర్వపడే విధంగా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ ఏ.మలోల మాట్లాడుతూ… భారత దేశం లక్షలాదిమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమని స్వతంత్రం వచ్చిన మనం మనలను పాలించుకోవడానికి అవకాశం వచ్చిందని అన్నారు. గతంలో చాలా దేశాలలో వివిధ రకాల పాలనలను గమనించి, పరిశీలించడం జరిగిందని ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి న్యాయ, స్వేచ్ఛ,సమానత్వం హక్కులు కల్పించాలని ఉద్దేశంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తయారు చేసినది భారత రాజ్యాంగం పీఠిక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారి చేత ప్రతిజ్ఞ చేయించారు . ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల,డిపిఎం ఆనంద్, కలెక్టర్ కార్యాలయం ఏ ఓ అలెగ్జాండర్,కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ యుగేశ్వరి, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, జిల్లా టూరిజం అధికారి జయ కుమార్ బాబు , ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ పి.గురుస్వామి శెట్టి, మెజిస్టీరియల్ విభాగం సూపరింటెండెంట్ వసంతలత, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజు, కలెక్టరేట్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.