అప్పుడే ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది.. ఆయుర్వేదిక్ న్యూట్రీషియన్ అడ్వైజర్ దామోదర్
విశాలాంధ్ర ధర్మవరం : శరీర అవయవాల వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకుంటే ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని ఆయుర్వేదిక్ న్యూట్రీషియన్ అడ్వైజర్ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవపురం 26వ వార్డులో పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర బాడీ హెల్త్ చెకప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దామోదర్గా తాను తన మిత్రుడు రాజు కలిసి నేటి కాలంలో పేద ప్రజలు యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేవలం బాడీ హెల్త్ చెకప్ ను 100 రూపాయలకే చేయించాలన్న తలంపుతోనే ఈ శిబిరమును నిర్వహించడం జరిగిందని తెలిపారు. కేఈవిఎ-బిఎంఐ 4జి క్వాంటం మిషన్ల ద్వారా ఈ పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ చెక్కకు ద్వారా మన శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయా? లేదా? అన్న సమస్యలు కేవలం 10 నిమిషాలలోనే తెలుసుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా ఆయుర్వేదిక్ మందుల ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ శిబిరంలో 50 మంది వైద్య పరీక్షలకు (బాడీ హెల్త్ చెకప్) రావడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి వివరించడం జరిగిందని తెలిపారు. శరీరములో ఏదో ఒక అవయం పనిచేయకపోతే అనారోగ్య సమస్యలు తప్పక వస్తాయని తెలిపారు. కావున అనారోగ్య విషయంలో ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు పొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం లక్ష్మీ చెన్నకేశవపురం ప్రజలు ఈ క్యాంపు నిర్వహణ పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలను తెలియజేశారు.
శరీర అవయవాల వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి..
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయమునకు గంట విరాళం చేసిన దాత..
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణములోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి అతి పురాతనమైన దేవాలయమునకు నైవేద్య గంటను పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన
రియల్ ఎస్టేట్ వ్యాపారి కుంచపు వడ్డే లక్ష్మీ ప్రసాద్, భార్య లక్ష్మీకాంతమ్మ భక్తితో నైవేద్య గంటను ఆలయ ఈవో వెంకటేషులకు సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ ఆలయ గంట 221 కేజీలు బరువు కలదని, దీని విలువ రూ. .5,50,000 కలదని తెలిపారు. దాతలచే ప్రత్యేక పూజలతో పాటు అర్చకుల నడుమ హోమములను కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. తొలుత అర్చకులు కోనేరాచార్యులు మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్, మారుతీ వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ దాతల దంపతులచే ప్రత్యేక పూజలతో పాటు హోమములను నిర్వహించడం జరిగిందని తెలిపారు. దాతలు మాట్లాడుతూ అతి పురాతనమైన దేవాలయమునకు తన కుటుంబం తరఫున ఈ నైవేద్య గంటను సమర్పించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, భక్తి భావంతో తాను సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ నైవేద్య గంట ఆలయానికి వన్నె తెస్తుందని, ఆలయ గంట మోగినప్పుడు భక్తి భావంతో భక్తాదులు ఉప్పొంగి పోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో తో పాటు మాజీ ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, అన్నమయ్య సేవా మండలి అధ్యక్షులు పోరాల్ల పుల్లయ్య వారి శిష్య బృందం, ఆలయ సిబ్బంది, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం..
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం : పేద ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం గౌరవ అధ్యక్షులు, క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి), బంధనాదం చిన్నికృష్ణ, వేల్పుల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 105వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో దాతలుగా కీర్తిశేషులు వేల్పుల వెంకటమ్మ, కీర్తిశేషులు వేల్పుల బూసప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు వేల్పుల వెంకటేశు అండ్ సన్స్ వారు వ్యవహరించడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రతినెల ఈ కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారాలను తోనే నిర్వహిస్తున్నామని ఒక నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వైద్యులైన డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ సుబ్రహ్మణ్యం-హైదరాబాద్, డాక్టర్ వినయ్ కుమార్ వారిచే రోగులకు వైద్య చికిత్సలను అందించడంతోపాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 285 మంది రోగులు పాల్గొని వైద్య చికిత్సలు పొందడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ప్రతినెల 200 రూపాయలు చొప్పున 500 మందికి పెన్షన్ పేద ప్రజలకు గత కొన్ని సంవత్సరాలుగా పెన్షన్ రూపంలో అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండి నాగరాజు, బండి ఆంజనేయులు, మేకల శివయ్య, మామిళ్ళ అశ్వత్త నారాయణ, పెద్దకోట్ల విజయ్ ,పెద్ద కోట్ల భాస్కర్, బండి మని,పవన్ కుమార్, రోగులు పాల్గొన్నారు.
ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (గుట్ట కింద పల్లి) లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ హబ్ ఏర్పాట్లు భాగంగా ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులు డిసెంబర్ రెండవ తేదీ నుండి ఆఫీస్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ కోర్సును ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు పదవ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణత, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీలో బి ఎ అండ్ బీకాం చేసి ఆసక్తి కలిగిన యువతీ యువకులు నమోదు చేసుకోవాలని తెలిపారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశమును కూడా కల్పించబడునని తెలిపారు కావున నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9182288465కు కానీ నేరుగా కళాశాల యందు కూడా సంప్రదించవచ్చునని తెలిపారు.
ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు… హెడ్మాస్టర్ శైలజ
విశాలాంధ్ర- ధర్మవరం : భారత రాజ్యాంగదినోత్సవం ఉత్సవాల వేడుకలు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ప్రధానోపాధ్యాయురాలు శైలజ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు సునీత విద్యార్థులతో నమూనాలను తయారు చేయించి ప్రదర్శించారు అని తెలిపారు. విద్యార్థుల యొక్క ఆలోచన విధానం, ప్రతిభ జాతీయ భావనలతో కలిగిస్తూ జాతి ఐక్యతకు తోడ్పడే విధంగా నమూనాలు ఉన్నాయని తెలియజేశారు. రాజ్యాంగ హక్కులు బాధ్యతలు, భారత దేశ ప్రజల జీవన విధానంలోని అంశాలతో కూడుకున్న నమూనాలని, టీచర్ సునీత ప్రోత్సహిస్తూ సృజనాత్మకతను కలిగించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రశంసిస్తూ భవిష్యత్తులో రాజ్యాంగ నిబంధనలు అందరూ పాటించి మెలగాలని తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థాయి భారత వ్యవస్థ కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హిందీ పండిట్ వేణుగోపాల్, హేమలత, శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి హరికృష్ణ, ప్రసాద్ ,నాగేంద్ర ,నాగరాజు పాల్గొన్నారు.
మొక్కలను నాటి, సంరక్షించాలి… ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని నిమ్మలకుంట గ్రామములో ప్రాథమిక పాఠశాల యందు ఉపాధి హామీ పథకము ద్వారా ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. పాఠశాల ఆవరణములో పిచ్చి మొక్కలను గ్రామస్తుల సహకారంతో తొలగించిన ప్రతిప నోరు మొక్కలను నాటి సంరక్షణ చేయుట కోసం ఉపాధి హామీ క్రింద రూ. 1,20,000 ఖర్చు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అంబుష్ మెన్ శివారెడ్డి మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలను విరివిగా చేపట్టి, కాలుష్య నివారణ కోసం అందరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ వేణుగోపాల్ టి. ఏ. చంద్రకళ,పంచాయతీ కార్యదర్శి జయంత్ రెడ్డి,చంద్రశేఖర్,గ్రామ నాయకులు, ప్రజలు, కూలీలు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన చేసుకోవాలి..
వన్టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్
విశాలాంధ్ర -ధర్మవరం : సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ తప్పక అవగాహన చేసుకోవాలని వన్టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మహిళలపై జరుగుతున్న నేరాలు, సైబర్ నేరాలపై విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం మైనర్ గా ఉన్న విద్యార్థినిలు జాగ్రత్తగా ఉండాలని, కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని తెలిపారు. అదేవిధంగా నిత్యజీవితంలో ఒక భాగమైన సెల్ఫోన్లను కేవలం చదువు కొరకు మాత్రమే సంబంధించిన వాటిని మాత్రమే చూసుకోవాలని, ఇతరత్రా వేరేవి చూసుకున్నట్లయితే జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థిని చదువుకు ప్రాధాన్యత ఇస్తూ, అమ్మానాన్నల కష్టాన్ని గుర్తించాలని తెలిపారు. అప్పుడే కుటుంబానికి, కళాశాలకు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇక సైబర్ నేరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, వాటిపైన చక్కటి అవగాహన చేసుకున్నప్పుడే, మన దగ్గర ఉన్న డబ్బు పదిలంగా ఉంటుందని తెలిపారు. సెల్ ఫోన్ లో ఏది పడితే అది సబ్స్క్రైబ్ చేయడం, యాపులను డౌన్లోడ్ చేయడం, పరిచయం లేని వ్యక్తి, వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయమని చెప్పినప్పుడు ఏ మాత్రమూ స్పందించకూడదని తెలిపారు. సైబర్ నేరాలపై మీ కుటుంబంతో పాటు ఇతరులు కూడా అవగాహన కల్పించాలని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చక్కటి చదువును కొనసాగిస్తూ ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. మీ భద్రత, మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉందని తెలిపారు. అధ్యాపకులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని, మంచి గుర్తింపును పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ తో పాటు, అధ్యాపకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.
మౌలానా ముస్తాక్ అహ్మద్ కలిసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీలు
విశాలాంధ్ర-ధర్మవరం : ఉమ్మడి జిల్లాలోని పలువురు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులు ఇటీవల మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా ముస్తాక్ అహ్మద్ ఎంపికైనందుకు సోమవారం నంద్యాల పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి , దుశ్శల్వా తో సన్మానించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులు తెలిపారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ సోదరులకు సంబంధించిన పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. అనంతరం చైర్మన్ స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే దిశలో తాను కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ధర్మవరం,పుట్టపర్తి,కదిరి, ఉరవకొండ,నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
నియోజక అభివృద్ధి పనులకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది..
ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర- ధర్మవరం:: నియోజకవర్గ అభివృద్ధితోపాటు ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టుతుందని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాలలో వారు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా తొలుత నియోజకవర్గంలోని బత్తలపల్లి లో కేజీబీవీ పాఠశాల భవనాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య వైద్యకు ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడదని, అభివృద్ధి బాటలో నడిపేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. తదుపరి మంత్రి పట్టణంలోని ప్రధాన కాలువల పూడిక తీసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పూడిక తీసే కార్యక్రమాన్ని స్వయంగా వారు వీరితోపాటు చిలకం మధుసూదన్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొని పూడికతీత ను తీయడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ మంచినీరు సరఫరా ప్రాజెక్టుల గురించి వివరిస్తూ 62 కోట్ల 68 లక్షల రూపాయల నిధులతో అమృత్ పేస్ట్ కింద పనులను చేపడుతున్నట్లు ధర్మవరం పట్టణాన్ని పరిశుభ్రమైన ఆకర్షణీయమైన ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనులు చేపడుతోందని ఎందుకు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు.అనంతరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులకు సమీక్ష సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి పనులను, పెండింగ్ పడిన పనులు, అభివృద్ధి సంక్షేమ పథకాలపై విభాగాల వారీగా అధికారులతో నేరుగా సమీక్షణ జరిపారు. ఈ సమీక్షలో ప్రతి విభాగానికి చెందిన అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల దరిన చేర్చేలా కృషి చేయాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగిందని తెలిపారు. ప్రజల వద్ద ఎటువంటి ఫిర్యాదుల అందిన సహించేది లేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల పని చేసేందుకే ఉన్నారని, లంజాలకు అలవాటులోకి పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని మండలాల వివిధ విభాగాల అధికారులు ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. స్పందించిన మంత్రి వాటిని ప్రభుత్వ దిష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి చెలిమి జీర్నోదరణ కార్యక్రమానికి వారి విచ్చేసి కార్తీక దీపోత్సవాన్ని వారు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ కార్తీకమాసం హిందువులకు ఎంతో ముఖ్యమైనదని ప్రాముఖ్యత చాటుకుంటుందని తెలిపారు. దైవ ఆశీస్సులు లేనిదే ఏ పనిని కూడా మనిషి చేయలేడని తెలిపారు. అనంతరం త్రిలింగేశ్వర స్వామి ఆలయమును దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలోనూ మంత్రితోపాటు చిలక మధుసూదన్ రెడ్డికి కూడా ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం తన పర్యటనలో ప్రజల నుంచి అర్జీలు కూడా తీసుకొని త్వరలో పరిష్కరించే దిశలో చర్యలు చేపడతామని అక్కడి ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారీ ర్యాలీ
కార్మిక వ్యతిరేక లేబర్ చట్టాలను ఉపసంహరించుకోవాలి…
చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగమయ్య
విశాలాంధ్ర -అనంతపురం : కార్మిక వ్యతిరేక లేబర్ చట్టాలను ఉపసంహరించు కోవాలని చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగమయ్య డిమాండ్ చేశారు. కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ. దేశవ్యాప్తంగా 500 కలెక్టరేట్ కార్యాలయం వద్ద కార్మిక రైతాంగ చేతి వృత్తిదారుల సమైక్య యువజన విద్యార్థి సంఘాలు,కార్మిక, చేనేత, యువజన మహిళా సంఘాల నాయకులు మంగళవారం స్థానిక లలిత కళ పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లింగమయ్య మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ కార్మిక మహిళ వ్యతిరేకంగా అనేక చట్టాలను రూపొందిస్తోందన్నారు. ప్రజలు కాంక్ష ప్రజాజీవన అభివృద్ధి కోసం పాటుపడకుండా పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచి పోషించే విధంగా ఈరోజు ప్రభుత్వ రంగ స్థలాలను వేలంపాటలో అమ్మడానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ నిరక్షరాస్యత నిరుద్యోగం పెరుగుతున్న సమయంలో ఆ వైపున చట్టాలను తీసుకురాకుండా రైతాంగ నల్ల చట్టాలతో రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా లేబర్ చట్టాల సవరణ ద్వారా లేబర్ కోడ్ ని ఉల్లంఘికంగా కార్మికులకు వ్యతిరేకంగా అనేక చట్టాలను రూపొందిస్తానని కార్మిక బోర్డు ఏర్పాటు చేసి వాళ్లకు నిధులు కేటాయించకుండా వారికి పనిముట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిరంకుశ వైఖరితో ధోరణితో అనేక ప్రయత్నాలు చేస్తూ దేశ ప్రజలను ఓట్ల రూపంలో ఓటుగానే చూస్తున్నారని వారి జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేయట్లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ కార్మిక వ్యతిరేక లేబర్ చట్టాలని ఉపసంహరించుకొని రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకొని ఆ సంఘాలకు సంఘాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నించాలన్నారు . చేతి వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళకి విధులు కేటాయించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ ఇలాంటి నిరంకుశ నిర్లక్ష్య ధోనిని విడనాడాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి సంతోష్,గొర్లు మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య, చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సి.వి.హరి కృష్ణ,జిల్లా ఉపాధ్యక్షుడు నాగప్ప, రైతు సంఘం నాయకులు రామాంజనేయులు, నాయకులు వీరాంజి , యువజన సమాఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.