Monday, January 6, 2025
Home Blog Page 81

గంజాయి సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం

గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ప్రశ్నలకు అనిత సమాధానాలు
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్న అనిత

ఐదేళ్ల వైసీపీ పాలనలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ హోం మంత్రి అనిత విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, వారిని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అనిత సమాధానమిచ్చారు. ఐదేళ్లలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ పై జగన్ ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని… దీంతో దుండగులు రెచ్చిపోయారని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఏడు సార్లు సమీక్ష నిర్వహించారని తెలిపారు. గంజాయి కట్టడికి చర్యలు చేపట్టామని… ప్రత్యేక టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఐదు నెలల్లో 25 వేల కిలోల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. గంజాయిని సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. వారి ఆస్తులు సైతం జప్తు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ… గంజాయిని కట్టడి చేసే అంశంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని స్పీకర్ ను కోరారు. ఈ సమావేశాలు లేదా వచ్చే సమావేశాల్లోనైనా చర్చిద్దామని చెప్పారు.

అసెంబ్లీలో నేడు ఆరు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు రానున్నాయి.. ప్రశ్నోత్తరాల తో అనంతరం ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్.ఎంఎడి.ఫరూక్.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు..

రుషికొండ నిర్మాణాలు, NGT నిబంధనల ఉల్లంఘన.. వరదల వల్ల ఏర్పడిన పరిస్ధితులపై స్వల్పకాలిక చర్చ సాగనుంది..

ఇక, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లు విషయానికి వస్తే..

ప్రభుత్వ బిల్లులు:1. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టం 2024, మంత్రి అనగాని సత్యప్రసాద్

  1. ఏపీ మునిసిపల్ చట్టాల రెండవ సవరణ బిల్లు 2024, మంత్రి నారాయణ
  2. AP GST సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్
  3. AP VAT సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్
  4. ఏపీ ధర్మ, హిందూమత సంస్ధలు, దేవాలయాల చట్ట సవరణ బిల్లు 2024, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
  5. ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ రిపీల్ బిల్లు 2024, బి.సి.జనార్ధనరెడ్డి

మంత్రుల ఇచ్చే స్టేట్‌మెంట్లు..

  1. డ్రోన్ పాలసీ పై మంత్రి బి.సి.జనార్ధనరెడ్డి2. స్పోర్ట్స్ పాలసీ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి3. పర్యాటక పాలసీ పై మంత్రి కందుల దుర్గేష్4. ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్ పాలసీలపై మంత్రి నారా లోకేష్మరోవైపు..

శాసన మండలిలో

నేడు కౌన్సిల్ లో.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అవసరమైన ఏర్పాట్లు అంశంపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు ఏపీ లా అండ్ జస్టిస్ మంత్రి ఎన్ఎండీ ఫరూక్.. ఇక, అంగన్వాడీల సమస్యలపై కౌన్సిల్ లో తాత్కాలిక చర్చ సాగనుంది..

శాసన మండలిలో ప్రభుత్వ బిల్లులు:

  1. ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర
  2. భారత దేశంలో తయారైన విదేశీ మద్యం నియంత్రణ సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర
  3. ఏపీ ప్రొహిబిషన్ సవరణ బిల్లు 2024, మంత్రి కొల్లు రవీంద్ర
  4. ఏపీ అప్రాప్రియేషన్ సవరణ బిల్లు 2024, మంత్రి పయ్యావుల కేశవ్

గౌతమ్ అదానీపై రూ.2,236 కోట్ల లంచం ఆరోపణలు..

అమెరికాలో కేసు, అరెస్ట్ వారెంట్ జారీ!
సంచలన పరిణామం చోటుచేసుకుంది. భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. లంచం, మోసపూరిత కుట్ర కింద అభియోగాలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ, మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో ఏడుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చినట్టు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్ట్ వారెంట్స్ జారీ అయ్యాయని అధికారులు చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌లపై సెక్యూరిటీ ఫ్రాడ్, సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయాయి. అంతేకాదు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్టు తెలిపారు.

అదానీలు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈవో వినీత్ జైన్ తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని ాన్యూమెరో యునో్ణ, ాబిగ్ మ్యాన్్ణ అనే కోడ్ పేర్లతో కుట్రదారులు అదానీ పేరుని ప్రైవేట్‌గా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్‌ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు.

కాగా అమెరికాలో నమోదయిన ఈ అభియోగాలపై అదానీ గ్రూప్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ పరిణామంపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇంకా స్పందించలేదు. నిందితుల తరఫు న్యాయవాదులు ఎవరనేది కూడా ఇంకా తెలియరాలేదు.

పదో తరగతి విద్యార్థులు తెలుగులో కూడా పరీక్షలు రాసుకోవచ్చు.. అవకాశమిచ్చిన ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కావాలనుకుంటే పబ్లిక్ పరీక్షలు తెలుగు మాధ్యంలోనే రాసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో ఈ మేరకు సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇది ఈ ఒక్క ఏడాదికే పరిమితం కానుంది. 2020-21లో ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 తరగతులను ఇంగ్లిష్ మాధ్యమంలోకి మార్చుతూ అప్పటి సర్కారు ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఒక్కో తరగతిని ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుతున్నట్టు ప్రకటిస్తూ పదో తరగతిలోకి వచ్చిన విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలోనే పరీక్షలు రాయాలనే నిబంధన విధించింది. అయితే, సుప్రీంకోర్టులో ఈ విషయమై కేసు దాఖలు ాకావడంతో ాఇంగ్లిష్ మీడియం అని చెప్పకుండా ాఒకే మాధ్యమం ఉండాలని ఆదేశించింది. ఒకే మాధ్యమం అని చెప్పి, అది ఏ మాధ్యమం అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో చాలా పాఠశాల్లలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండింటినీ కొనసాగించారు. ఈ నేపథ్యంలో తెలుగులో చదివిన విద్యార్థులు తెలుగులో పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలంటూ ఉపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి తెలుగులో పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఘనంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం….

కరెస్పాండెంట్ నరేంద్రబాబు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్ లో గల సూర్య ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు నడుమ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ నరేంద్రబాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 1989లో బాలల హక్కుల సదస్సును అసెంబ్లీ ఆమోదించిన రోజును సూచిస్తుందని తెలిపారు. మానవ హక్కుల ఒప్పందమైన హింస నుండి రక్షించడానికి, జీవించే హక్కు, ఆరోగ్యం ,విద్య, ఆటలు, అనేక బాలల హక్కులను నిర్దేశిస్తుందని తెలిపారు. ఇదే రోజున అంతర్జాతీయ బాలల దినోత్సవం గా కూడా జరుపుకుంటారని తెలిపారు. పాఠశాలలో వివిధ ప్రదర్శన కూడా నిర్వహించిన వైనం అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జ్యోతి, మారుతి, సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు పంపిణీ

0

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రంథాలయ శాఖ 57వ వారోత్సవాలు మండల కేంద్రమైన పెద్దకడబూరులో బుధవారం గ్రంథాలయ అధికారిణి ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముగిసాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు మల్లికార్జున, రాఘవేంద్ర, ఖాజా హుస్సేన్, చాంద్ భాష, వీరేష్, ఖాజా మొహినుద్దీన్, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇసరపువాని చెరువు కబ్జా

మట్టితో కప్పేసి నిర్మాణాలకు యత్నం

  • చోద్యం చూస్తున్న అధికారులు
  • పెదముషిడివాడలో ఆగని అక్రమాలు
    విశాలాంధ్ర – పరవాడ(అనకాపల్లి జిల్లా)బీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు మాసాలు గడిచినా పరవాడ మండలం పెదముషిడివాడలో కబ్జాదారులకు, అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డగోలుగా జరిగిన అక్రమాలు కొత్త ప్రభుత్వంలోనూ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వారంరోజలుగా సర్వేనెంబర్‌ 114లో ఇసరపువాని చెరువు కబ్జాకు గురవుతోంది. కొందరు అక్రమార్కులు చెరువును మట్టితో కప్పేసి నిర్మాణాలు జరిపేందుకు సిద్దమయ్యారు. ముఖ్యంగా 5.53 ఎకరాల విస్థీర్ణం గల ఈ ఇసరపువాని చెరువు మద్యలో నుంచి పరవాడ – అసకపల్లి ప్రధాన రహదారి ఉంది. ఈ రహదారి కారణంగా చెరువు రెండు భాగాలు అయిపోయింది. పడమట దిశలో సుమారు 3.50 ఎకరాలు, తూర్పు దిశలో సుమారు రెండెకరాలుగా ఈ చెరువు విడిపోయింది. అయితే తూర్పు వైపున ఉన్న రెండెకరాల పక్కన ఓ వెంచర్‌ ఉండటం, పైగా దానికి ప్రధాన రహదారి కూడా కలిసి రావడంతో ఈ పంచాయితీలో అక్రమ దందాలు నడిపిస్తున్న కొందరి వైసీపీ నాయకుల కళ్లు ఈ చెరువు స్థలంపై పడ్డాయి. ఇంకేముంది అనుకున్నదే తడువుగా ఆ అక్రమార్కులు నాలుగేళ్ల క్రితం ఈ రెండెకరాల స్థలాన్ని ఆక్రమించి అందులో కొంత విస్థీర్ణాన్ని ప్లాట్లు లెక్కన విక్రయించేసారు. రిజిస్ట్రేషన్‌ స్టాంపు పేపర్ల మీద అగ్రిమెంట్‌ చేసి ఏకంగా చెరువు స్థలాన్నే అమ్మేసారు. ఇందులో స్థలాలను కొనుక్కున్న వ్యక్తుల్లో ఒకరిద్దరు గతంలో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించడంతో సమాచారం అందుకున్న అప్పటి రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం మారడంతో అక్రమార్కులు కూటమి నేతలను మచ్చిక చేసుకుని తిరిగి చెరువును చెరపట్టేందుకు పావులు కదిపారు. రెవెన్యూ అధికారులూ కొత్తవారే కావడంతో వారిని కూడా లోబరుచుకుని వారం రోజల క్రితం అక్రమార్కులు రాత్రికి రాత్రే చెరువు కొంత భాగాన్ని మట్టితో కప్పేసారు. అందులో నిర్మాణాలు జరిపేందుకు నిర్మాణ సామగ్రి (రాయి)ని కూడా రెడీగా ఉంచారు. ఇంత బహిరంగాంగానే చెరువు స్థలం కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరో పక్క ప్రస్తుత రెవెన్యూ అధికారుల్లో కూడా ఇంకా వైసీపీ వాసన వదిలినట్లు కనిపించలేదు. ఇదంతా చూస్తుంటే కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ నాయకుల అక్రమాలకు అడ్డుకట్ట పడ్డం లేదనే చెప్పాలి. అయితే ఈ చెరువు కబ్జాపై ఆర్వో పృధ్విని విశాలాంధ్ర ప్రతినిధి వివరణ కోరగా కబ్జా విషయం తమ ధృష్టికి వచ్చిందన్నారు. తహశీల్ధారు అంబేద్కర్‌ ధృష్టికి తీసుకెళ్లి ఆయన ఆధేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వీఆర్వో చెప్పారు.

శకుంతలమ్మ పార్థివ దేహానికి సిపిఐ ఘన నివాళులు

నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకురాలు సిపిఐ

జిల్లా కార్యదర్శి సి జాఫర్

విశాలాంధ్ర అనంతపురం : కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ మృతి మహిళా సమాఖ్య కార్మిక ఉద్యమానికి తీరని లోటు, నిబద్ధత కలిగిన నాయకురాలు అని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పేర్కొన్నారు. బుధవారం కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకురాలు శకుంతలమ్మ పార్థివ దేహానికి సిపిఐ నాయకులు ఘన నివాళులర్పించారు. అనంతపురం సంగమేష్ నగర్ ఆమె నివాసం నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి శకుంతలమ్మ భర్త ఋషేంద్ర బాబు, కుమారడు రాజేష్, కుమార్తె హిమబిందు సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో అనంతపురం వైద్య పరిశోధన నిమిత్తం ఆమె దేహాన్ని అనంతపురం మెడికల్ కాలేజీ అందచేశారు.
ఈ సంద్భంగా అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మాజీ జిల్లా అధ్యక్షురాలు, ఏఐటియుసి మాజీ జిల్లా అధ్యక్షులు మరియు మాజీ గౌరవ అధ్యక్షులు గా వివిధ బాధ్యతల్లో పనిచేసిన కామ్రేడ్ శకుంతలమ్మ మంగళవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నామన్నారు. గత 40 సంవత్సరాలుగా పీడిత ప్రజల కోసం, పార్టీలో వివిధ బాధ్యతలు తీసుకొని నిర్విరామంగా అలుపెరుగని పోరాటం చేసిన, నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు నాయకురాలు శకుంతలమ్మ భౌతికంగా ప్రస్తుతం మన మధ్య లేరన్నారు. కార్యకర్తలతో ఆప్యాయంగా పలకరించే శకుంతలమ్మ ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినా పేద ప్రజల పట్ల ఆప్యాయత చూపించేవారు అని పేర్కొన్నారు. మహిళా ఉద్యమాల్లో హుందాగా వ్యవహరించడం ఆమె నైజం అన్నారు. పార్టీ అభివృద్ధి,విస్తరణ గురించి తపన పడేవారన్నారు. కామ్రేడ్ శకుంతలమ్మ మరణం మహిళా సమాఖ్య,కార్మిక ఉద్యమానికి తీరని లోటన్నారు. శకుంతలమ్మ మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబానికి సానుభూతిని భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిల్లా సమితి తరఫున తెలియజేస్తున్నామన్నారు. ఆమె బ్రతికున్నంత కాలం సమాజం కోసం సేవ చేశారన్నారు . మరణించిన తర్వాత శకుంతలమ్మ పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టినందులకు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.నారాయణస్వామి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి, సంజీవులు, సీనియర్ నాయకులు అమినమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, శ్రీరాములు,రమణ, బద్రి స్వామి, కేశవరెడ్డి, సంతోష్ కుమార్, రాజేష్, సిపిఐ నాయకులు అలిపిర నారాయణస్వామి, సుందరాజు, మల్లికార్జున, కృష్ణుడు మున్న గందిలింగప్పా జమీర్ ఏఐటీయూసీ రాజు, ఏఐవైఎఫ్ నాయకులు మోహన్ కృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి

ఏపి మహిళా సమాఖ్య డిమాండ్‌
విశాలాంధ్ర – పరవాడ(అనకాపల్లి జిల్లా)బీ విశాఖలో న్యాయ విద్యార్ధిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఏపి మహిళా సమాఖ్య అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బూసి పరమేశ్వరి డిమాండ్‌ చేశారు. అత్యాచారానికి గురైన న్యాయ విద్యార్థినికి న్యాయం చేయాలని కోరుతూ ఏపి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో బుధవారం దేశపాత్రునిపాలెం అంబేద్కర్‌ విగ్రహం వద్ద మహిళలు నిరసన చేపట్టారు. బాధితులరాలికి సత్వర న్యాయం కోసం కేసును ప్రత్యెక కోర్టుకు బదలాయించాలని నినాదాలు చేసారు. ఈ సందర్భంగా పరమేశ్వరి మాట్లాడుతూ సమాజంలో ఆడ పిల్లలకు రక్షణ కొరవడిరదన్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో ఆడపిల్లలను వంచించే మృగాళ్లను శిక్షించడానికి నేడున్న నిర్భయ చట్టం చాలదన్నారు. ఇంకా కఠిన శిక్షలతో పటిష్టమైన చట్టాల అమలుకు ప్రత్యేక యంత్రాంగం అవసరం ఉందన్నారు. విద్యాసంస్థల్లో ఆడపిల్లల పట్ల సహచర విద్యార్థులు, పురుష సిబ్బంది ప్రవర్తన, నడవడికపై పోలిసు నిఘా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలో ఆడపిల్లల ఇబ్బందులు నిర్భయంగా చెప్పుకునేందుకు ఆత్మీయ స్పర్శ, నైపుణ్యం కలిగిన కౌన్సిలర్ల నియామకం తప్పనిసరి చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయ విద్యార్థిని అత్యాచార దోషులకు న్యాయవాదులెవరు బెయిల్‌ పిటిషన్‌ వేయరాదని పిటిషన్‌ వేసిన న్యాయవాదిని బార్‌ అసోసియేషన్‌ నుండి బహిష్కరించాలని న్యాయవాదులకు పరమేశ్వరి విజ్ఞప్తి చేశారు. కె.లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కె.తులసి, బి.సుగుణ, కె.రమణమ్మ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: హైస్కూల్ప్లస్లలోఇంటర్మీడియట్ ను బోదించేందుకు. స్కూల్ అసిస్టెంట్ లకు ప్రమోషన్లు ఇచ్చి పూర్తి స్థాయిలో పీజీటీ లను ఏర్పాటు చేయాలని శాసన మండలిలోప్రభుత్వాన్ని కోరినఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలల్లో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్ లు బలోపేతం కావాలంటే , పేద పిల్లలకు నాణ్యమైన ఇంటర్ మీడియట్ విద్య అందాలంటేతప్పని
సరిగా పిజిటి హోదా తో పని చేసే పూర్త స్థాయి అధ్యాపకులు అవసరం ఉంది. కాబట్టి సంబంధిత మానేజ్మెంట్ స్కూల్స్ లోని స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రమోషన్లు కల్పించి పూర్తి స్థాయి పిజిటి లను ఏర్పాటు చేయాలని కోరారు ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ తమ మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 23% కంటే తక్కువ లేకుండా ఐఆర్ ని ప్రకటించాలని కోరడం జరిగింది.