విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీ, సాయి కృష్ణ వెంచర్ సమీపాన గల రైల్వే ట్రాక్ పక్కన కంప చెట్లలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం పడి ఉన్నట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 35 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, శరీరంపై ఉన్న ఆనవాళ్ల ప్రకారం ఎదపై కుడి ప్రక్కన పుష్ప అనే పేరుతో పాటు తేలు మార్కు ట్యాటూ ఉందని తెలిపారు. మృతుడు నలుపు రంగు కట్ బనియన్ (దానిపై (సన్స్ అవుట్ గన్స్ అవుట్) అని రాసి ఉంది), నలుపు రంగు జీన్స్ ప్యాంటు, నీలం రంగు షార్ట్స్ మరియు లైట్ సిమెంటు రంగు బెల్టు ధరించి ఉన్నాడు. జేబులో మోటార్ సైకిల్ కీ మరియు ఖైని ప్యాకెట్ లభించాయి. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదని, ఎవరికైనా ఆనవాళ్ల ఆధారంగా సమాచారం తెలిస్తే వెంటనే రాప్తాడు పోలీస్ ఇన్స్పెక్టర్ టి.వి.శ్రీహర్ష సెల్ నంబర్ 9440796817 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.


