Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అల్పాహారం పంపిణీ

ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అల్పాహారం పంపిణీ

- Advertisement -

శ్రీ సత్య సాయి సేవ సమితి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి సేవా సమితి వారు ఉదయం 300 మంది రోగులకు పాలు ,బ్రెడ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, వెంకటేశు, వినోద్, రామాంజనేయులు, కాకుమని సాగర్ మాట్లాడుతూ పుట్టపర్తి బాబా ఆశీస్సులతో ఇటువంటి సేవా కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేటి ఈ సేవ కార్యక్రమానికి పట్టణంలోని రామ్ నగర్ లో గల వి రామయ్య దాతగా నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేందర్ నాయక్ సేవా సమితి వారికి ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరం లాగా మారాయని వారు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు