Homeఆంధ్రప్రదేశ్చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందని బావను దారుణంగా హత్య చేసిన సోదరులు

చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందని బావను దారుణంగా హత్య చేసిన సోదరులు

- Advertisement -

విశాలాంధ్ర – మండపేట : చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో బావను పాశవికంగా హత్య చేసిన బావమరుదుల ఉదంతమిది. మండపేట మండలం జెడ్ మేడపాడు గ్రామానికి చెందిన అయినవిల్లి సంధ్య ప్రస్తుత రాయవరం డిప్యూటీ తాసిల్దార్ గా పనిచేస్తుంది. ఆమె ద్వారపూడి కి చెందిన పోలుపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావు ప్రేమించుకున్నారు ఈ నేపథ్యంలో వీరు గురువారం అన్నవరంలో వివాహం చేసుకున్న విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు జేగురుపాడు కు చెందిన మరొక వ్యక్తి తో కలిసి గురువారం అర్ధరాత్రి ద్వారపూడి వెళ్లి విచక్షణ రహితంగా నడిరోడ్డుపై బండరాళ్లతో మోది దారుణంగా హతమార్చారు. దీనిపై మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు