Homeజిల్లాలుఅనంతపురంకాలిపోయిన సూర్యఘర్‌ సోలార్‌ మీటర్లు..

కాలిపోయిన సూర్యఘర్‌ సోలార్‌ మీటర్లు..

- Advertisement -

విశాలాంధ్ర, బొమ్మనహాల్‌: మండలంలోని ఉద్దేహాల్‌, గోనెహాల్‌ గ్రామాల్లో సూర్యఘర్‌ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్‌ మీటర్లు కాలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్దేహాల్‌ గ్రామానికి చెందిన రామన్న, రవి ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన సోలార్‌ మీటర్లు కాలిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు.ఇళ్లపై సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో మీటర్లు కాలిపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్‌ హెచ్చుతగ్గుల కారణంగా మీటర్లు కాలిపోయాయా.. లేక పరికరాల్లో సాంకేతిక లోపం కారణమా అనే విషయం అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది. కాలిపోయిన మీటర్లను సంబంధిత అధికారులు పరిశీలించి ఘటనకు గల కారణాలను వెల్లడించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన వినియోగదారులకు ప్రత్యామ్నాయ మీటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, నష్టపరిహారం అందించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఒకవైపు సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం, మరోవైపు ఏర్పాటు చేసిన పరికరాలు కాలిపోతున్న ఘటనలపై దృష్టి సారించి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు