విశాలాంధ్ర, కంబదూరు: కంబదూరు మండలం జెక్కిరెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుద్ఘాతానికి గురై ముదిగల్లు గ్రామానికి చెందిన బోయ వెంకటేష్ (60) మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ లోకేష్‌కుమార్ ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. జెక్కిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గొల్ల బాలకృష్ణ నూతన ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కోసం సోమనాథ్ అనే భేల్దారి ముదిగల్లు గ్రామం నుంచి నలుగురు కూలీలను తీసుకువచ్చాడు. ఇంటి పైభాగంలో పనులు చేస్తుండగా వెంకటేష్ విద్యుత్ వైర్లకు తగలడంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు వెంకటేష్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, వారందరికీ వివాహాలు జరిగినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.విద్యుత్ లైన్లు ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పనులు చేయాలని ఎస్ఐ లోకేష్‌కుమార్ సూచించారు.


