ప్రమాద సంఘటనపై ఆరా తీసిన హోంమంత్రి వంగలపూడి అనిత
విశాలాంధ్ర -యస్ .రాయవరం :అనకాపల్లి జిల్లా ,ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు వద్ద ధర్మవరం కోస్టల్ గోల్డ్ రొయ్యల పరిశ్రమ కు చెందిన బస్సు బొల్తా పడడంతో 20 మంది మహిళల కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఉదయం కోట ఊరట్ల మండలం లింగాపురంలో మహిళా కార్మికులను ఎక్కించుకుని ధర్మవరం బయలు దేరిన కోస్టల్ బస్సు అదే మండలంలో పండూరు వద్ద మరికొందరు మహిళలను ఎక్కించుకోవడం జరిగింది. ఎస్ రాయవరం మండలం చినగుమ్ములూరు వచ్చే సరికి బస్సు అద్దంకు పొగ మంచుతో నిండిపోవడంతో పాటు స్టీరింగ్ తిరగక పోవడం రోడ్డు బాగోకపోవడం ఒకసారి ప్రక్కకు వెళ్లిపోయి బోల్తా పడింది. దీంతో ఈ ప్రమాదంలోని గాయాలు అవడంతో నక్కపల్లి 30 పడకల ఆసుపత్రికి తరలించగా ప్రధమ చికిత్స అందించారు .అందులో 13 మందికి తీవ్ర గాయాలు అవ్వడంతో అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా
చిన్న గుమ్ములూరు లో జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర హోం శాఖ వంగలపూడి అనిత ఆరా తీశారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కొందరు క్షతగాత్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచించారు. నర్సీపట్నం డిఎస్పి పోతిరెడ్డి శ్రీనివాసరావు తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రైవేట్ హాస్పిటల్ ఎండి తో కూడా మాట్లాడి గాయాలు అయినవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
