Friday, January 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉద్యమాలు చేసే నాయకులపైన కేసులు.. విద్యార్థిని చంపిన నారాయణ యాజమాన్యం ఏసి రూములలో..

ఉద్యమాలు చేసే నాయకులపైన కేసులు.. విద్యార్థిని చంపిన నారాయణ యాజమాన్యం ఏసి రూములలో..

నేడుసత్యసాయి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల బంద్ కు పిలుపు..

ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్బి, ఎన్ ఎస్ యు ఐ, వైయస్సార్ ఎస్ యు విద్యార్థి సంఘాలు.

నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

ముడుపుల మాయలో మునిగిపోయిన విద్యాశాఖ అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం : ఉద్యమాలు చేసే నాయకుల పైన కేసులు విద్యార్థిని చంపిన నారాయణ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా నాయకులు మాట్లాడుతూఅనంతపురం నగరంలో నారాయణ విద్యాసంస్థలలో ఫీజుల వేధింపుల కారణంగా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మరణిస్తే తక్షణమే నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాల పైన కేసులు నమోదు చేసి సీజ్ చేయాలని గత వారం రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు కానీ, పోలీసు యంత్రాంగం గాని, యాజమాన్యం పైన కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపారు. ఇటీవల నారాయణ కళాశాల దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపడితే విద్యార్థి నాయకులు అరెస్టు చేసి, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించి, విద్యాసంస్థల బంద్ కి పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు. విద్యార్థి మరణానికి కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యార్థి నాయకుల పైన కేసులు నమోదు చేస్తున్నారే కానీ ,విద్యార్థిని చంపిన నారాయణ కళాశాల యాజమాన్యాల పైన ఇంతవరకు పోలీసులు కన్నెత్తి చూడలేదని తెలిపారు. అనంతపురం జిల్లాలో పోలీసులు అంటే అపారమైనటువంటి ప్రేమ, నమ్మకం, విద్యార్థి సంఘం నాయకులకు ప్రజలకు ఉందన్నారు. ఒక విద్యార్థి కళాశాల భవనం పైకి ఎక్కి దూకి చనిపోతే, అక్కడ ఉన్న కళాశాల యాజమాన్యులు పోలీసులు రాకనే రక్తపు మరుకులన్నీ చేరిపి వేసినా కూడా వారి తండ్రి స్వయానా మా కుమారుడు ఫీజు రూపం లోనే మరణించాడని చనిపోయిన రోజు పత్రిక ముఖంగా తెలిపినప్పటికీ , విద్యార్థి సంఘాల నాయకులు రూరల్ డిఎస్పి వెంకటేశ్వర్లు నారాయణ విద్యాసంస్థల పైన కేసు నమోదు చేయాలని ఫిర్యాదు అందజేసిన, నేటికీ కళాశాల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయకుండా జిల్లా పోలీసులు ఉండడం దారుణము కాదా? అని వారు ప్రశ్నించారు.ఇప్పటికైనా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పందించి, నారాయణ కళాశాల యాజమాన్యం పైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఒక విద్యార్థి చనిపోతే కనీసం ఎందుకు చనిపోయాడు? ఫీజుల వే ధింపుతో చనిపోయాడా?అక్కడ ఏం జరిగిందని, ఇంతవరకు కళాశాలకు వెళ్లి విచారించకుండా విద్యాసంస్థల యాజమాన్యులు ఇస్తున్న ముడుపులకు కక్కుర్తి పడుతున్న జిల్లా ముడుపుల మాయలో విద్యాశాఖ అధికారులు మునిగిపోయారు అని నాయకులు మండి పడుతూ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు జిల్లావ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు బందుకు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పిలుపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ బందుకు జిల్లాలో ఉన్న విద్యాసంస్థల యాజమాన్యులు సహకరించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అనంతపురంలో జరిగిన సంఘటన పైన స్పందించి, మీరు ట్విట్టర్ల శాఖ మంత్రి కాదు నేను విద్యాశాఖ మంత్రి ఏదైనా సంఘటన జరిగితే మా ప్రభుత్వం స్పందిస్తుంది అని కేవలం సోషల్ మీడియాలో మాటలకు మాత్రమే పరిమితమైతారా లేక మా మంత్రివర్గంలో ఉన్న కళాశాల కాబట్టి మేము చర్యలు తీసుకోకుండా ఏసీ రూములలో కూర్చుంటామని అంటారా అని మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి తన నిజాయితీగా ఉంటే తక్షణమే జిల్లాలో ఉన్న నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో త్వరలో మీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరేష్ నామాల నాగార్జున ఏ ఐ ఎస్ బిజిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోతులయ్య జగదీష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ వైయస్సార్ ఎస్ యు జిల్లా అధ్యక్షులు పురుషోత్తం ఏ ఐ ఎస్ బి నాయకులు తరుణ్ ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ ,విక్కీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు