అనంతపురం జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి జోక్యంతోనే చుక్కలూరు గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ చుక్కలూరు గ్రామ ఇంచార్జ్ నాగరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల నుండి వర్షం వచ్చిందంటే కాలనీలలో వర్షం, మురుగు నీరు పోక ప్రజలు ఆ నీటిలోని నడుచుకుంటూ ఇంటిలోనికి వెళ్లి, ఇంటి నుండి బయటికి వెళ్లాలన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎన్నికల సమయంలో జెసి.అస్మిత్ రెడ్డి, జెసి.ప్రభాకర్ రెడ్డిలు చుక్కలూరు గ్రామం లో పర్యటించారు. ఆ సమయంలో గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొన్ని కాలనీలలో సిసి రోడ్లు, మురికి కాల్వలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారికి విన్నవించుకున్నారు. ప్రజల సమస్యలు విన్న జెసి. అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన వెంటనే చుక్కలూరు గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటుకు దాదాపు 30 లక్షలతో రోడ్లు నిర్మాణం చేస్తున్నామన్నారు. దీంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తమ సమస్యలను ఆలకించి గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.