Wednesday, December 18, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలు

విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో సిబ్బంది, పాఠకుల నడుమ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసిన ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వేణి 1953 అక్టోబర్ 1న ఏర్పడిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగమే నేడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో అందరూ నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, గంగాధర్, శివమ్మ, సత్యనారాయణ, అధిక సంఖ్యలో పాఠకులు పాల్గొన్నారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో;; పట్టణములోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరు రమణయ్య ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 72వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులతోపాటు అనుబంధ సంఘాలు, సభ్యులందరూ పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పిన్ను అశోక్ కోశాధికారి తబ్జులు శ్రీనివాసులు ఆలయ కమిటీ చైర్మన్ బిన్ను ప్రసాద్ వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు పూలమాల రూప రాగిణి కోశాధికారి నల్లపేట మంజు సంయుక్త, యువజన సంఘం, నగర సంకీర్తన బృందం, వాసవి భజన మండలి తదితరులు పాల్గొన్నారు.

అవోపా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు;; పట్టణంలోని ఆర్యవైశ్య అవోపా ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు అవోపాయించార్జ్ అన్న లక్ష్మీనారాయణ, పట్టణ అవోపా అధ్యక్షులు డాక్టర్ సీబా నగేష్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వాసవి సర్కిల్ వద్దగల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల హారాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగమే ఇప్పుడు తెలుగు రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ వర్ధంతి వేడుకలను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవోపా కార్యదర్శి కలవర కృష్ణకిషోర్ కోశాధికారి పనిరాజ్, సీబా సురేష్ గుప్తా సాయి కృష్ణ, ప్రసాద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు