Homeఆంధ్రప్రదేశ్పేదల ఆరోగ్య భద్రతపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ

పేదల ఆరోగ్య భద్రతపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ

- Advertisement -

ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.2,03,969 ల ఆర్థిక చెక్కులు

విశాలాంధ్ర పుట్టపర్తి:-పేదల ఆరోగ్య భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2,03,969 ల ఆర్థిక చెక్ ను ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు అందజేశారు. నియోజకవర్గానికి చెందిన ఇరగరాజుపల్లి శకుంతలమ్మా రూ.17150 లు, ఊటకూరు మల్లమ్మ కు రూ.30,323 లు,నల్లమాడ మండలం యర్రవంకపల్లి అన్నం నరసింహులు రూ.51300 ,ఓడి చెరువు మండలం సున్నం పల్లికి చెందిన వంశీకృష్ణ రూ.1,05196 ల ముఖ్యమంత్రి ఆర్థిక సహాయ నిధి చెక్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని తెలిపారు. పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు