Homeఆంధ్రప్రదేశ్నిరాహారదీక్ష కు జన సైనికుడు సిద్ధం

నిరాహారదీక్ష కు జన సైనికుడు సిద్ధం

- Advertisement -


విశాలాంధ్ర – కొవ్వూరు ; తనకు న్యాయం జరగాలని జన సైనికుడు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. వివరాల్లోకెళితే
ఈనెల ఎనిమిదో తేదీన కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీకి చెందిన కొవ్వూరు ఏఎంసి డైరెక్టర్ గంగుమల్ల స్వామి ని కొంతమంది తెలుగుదేశం పార్టీ యువకులు కొట్టారని, ఆ విషయంపై ఆ రోజు రాత్రి గంగుమళ్ల స్వామి దొమ్మేరు గ్రామంలో తన ఇంటి వద్ద టెంట్ వేసి నాకు న్యాయం చేయాలని కూర్చోవడం జరిగింది. అంతట ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోజు రాత్రి గంగుమళ్ల స్వామి దగ్గరికి వచ్చి నేను నీకు న్యాయం చేస్తానని మీ నాయకులతో మీరు చెప్పుకోండి అని చెప్పడంతో వారు తొమ్మిదో తారీఖు ఉదయం కందుల దుర్గేష్ వద్దకు నిడదవోలు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పడం జరిగింది. అంతట దుర్గేష్ నేను మీ నాయకులతో మాట్లాడతానని మీకు న్యాయం చేస్తానని చెప్పడంతో వాళ్లు వెనక్కి వచ్చేసి టెంట్ కూడా తీసేసారు. అప్పటి నుండి ఈరోజు వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదని ఏ నాయకులు నాతో మాట్లాడలేదని, అంటూ ఆదివారం ఉదయం 10:30 గంటలకు గంగుమళ్ల స్వామి మరల దొమ్మేరులో తన ఇంటి వద్ద టెంట్ వేయడం జరిగింది. సమస్య తేలక పోతే ఆ రోజు కొట్టినప్పుడు చిరిగిపోయిన చొక్కా వేసుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గంగమళ్ల స్వామి చెప్తున్నారు. ప్రస్తుతం గొంగమళ్ల స్వామి తో పాటు కొవ్వూరు జనసేన పార్టీ అధ్యక్షులు కాపవరం సొసైటీ చైర్మన్ సుంకర సత్తిబాబు , కొవ్వూరు మండల జనసేన పార్టీ సెక్రటరీ మైగాపుల బాలకృష్ణ , చాగల్లు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఉప్పులూరు చిరంజీవి, కల్లేపల్లి ప్రభాత్, పోలిశెట్టి శివ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు