Wednesday, February 18, 2026
Homeసినిమాచిరంజీవి..మన శంకరవరప్రసాద్‌ గారు హిట్‌టాక్‌

చిరంజీవి..మన శంకరవరప్రసాద్‌ గారు హిట్‌టాక్‌

- Advertisement -

పండగకు వస్తున్నారు.. అంటూ టాలీవుడ్‌లో పండగ తీసుకొచ్చారు మన శంకరవరప్రసాద్‌ గారు. చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ నేడు ప్రేక్షకుల ముందుకువచ్చి హిట్‌టాక్‌తో అలరిస్తోంది. చాలా రోజుల తర్వాత వింటేజ్‌ చిరును చూశామంటూ అభిమానులు సంబర పడుతున్నారు. దీంతో ప్రీమియర్స్‌ పూర్తికాగానే మూవీ టీమ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంది. చిరంజీవితో పాటు అనిల్‌ రావిపూడి, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కేక్‌ కట్‌ చేసి స్వీట్స్‌ తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు