. 18న ఖమ్మం సభకు తరలిరావాలి
. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్
. ఎన్టీఆర్జిల్లాలో విస్తృతంగా పార్టీ శతాబ్ధి ఉత్సవాల ప్రదర్శనలు
తిరువూరు/ఏ.కొండూరు/గంపలగూడెం: ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలిసిన అవసరముందని, ఆ వైపుగా ఈనెల 18వ తేదీన ఖమ్మంలో జరగనున్న మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభను జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్మిక-కర్షక సంఘాల్లో సీపీఐ కీలక పాత్ర పోషించిందని, విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజా పోరాటాల వరకు పార్టీ నిరంతరం ప్రశ్నించే గొంతుకగా నిలిచిందని పునరుద్ఘాటించారు. సీపీఐ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 18వ తేదీన ఖమ్మంలో లక్షలాది మందితో జరగనున్న బహిరంగను జయప్రదం చేయాలని కోరుతూ ఎన్టీఆర్జిల్లా సీపీఐ, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ఎన్టీఆర్జిల్లా ఆధ్వర్యంలో రెండు రోజులపాటు తలపెట్టిన ప్రచారం జాతాను ఆదివారం తిరువూరు సుంకర వీరభద్రరావు భవన్ వద్ద పెద్దఎత్తున జాతా నిర్వహించారు. ఈ జాతాను దోనేపూడి శంకర్ ప్రారంభించారు. అనంతరం బైక్ ర్యాలీ, ప్రజానాట్యమండలి కళాకారుల బృందంతో కూడిన జీపుజాతను తిరువూరులో పట్టణ పరిసర ప్రాంతాల్లో కొనసాగింది. అనంతరం తిరువూరులోని చీరాల సెంటర్, బోస్‌బొమ్మ సెంటర్, బైపాస్‌రోడ్డు సెంటర్ బహిరంగ సభలు జరిగాయి. ఎ.కొండూరు మండలంలోని కంభంపాడు, చీమలపాడులోను, గంపలగూడెం మండలంలోని తోటమూల, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జొన్నలగడ్డ, గుమ్మడిదర్రు, అనిగళ్లపాడులోను, పెనుగ్రంచిప్రోలు, నందిగామ, ఇబ్రహీంపట్నం జంక్షన్‌లోను బహిరంగ సభలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పెద్దఎత్తున బైక్, జీపు జాతాలకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. ఆయా సభల్లో దోనేపూడి శంకర్ మాట్లాడుతూ మతం, కులం పేరుతో దేశాన్ని విడదీయాలనుకునే శక్తులకు సీపీఐ వ్యతిరేకమని ఆయన నొక్కిచెప్పారు. మహాత్మాగాంధీని చంపిన వారుసులు నేడు దేశభక్తిని గురించి మాట్లాడుతున్నారని, చివరకు గాంధీజీ పేరునే మార్చి లౌకిక రాజ్యాంగ విలువలను మంటగలిపేలా బీజేపీ, సంఫ్‌ుపరివార్ శక్తులు కుటిల యత్నాలు చేస్తున్న సమయంలో ఖమ్మంలో 18న జరిగే మహాప్రదర్శన, బహిరంగ సభ..దేశంలోను, రాష్ట్రంలోను కమ్యూనిస్టుల పునరేకీకరణకు వేదిక కానుందని అన్నారు. నాడు తెలంగాణ రైతాంగ సాయిధపోరాటానికి ప్రత్యక్ష, పరోక్ష మద్దతిచ్చి, అసువులుబాసిన అమర వీరుల పశ్చిమకృష్ణాలో ఎంతో మంది ఉన్నారని, గ్రామ..గ్రామాన నేటికీ వారి స్థూపాలే ప్రత్యక్ష సాక్ష్యాలనీ గుర్తుచేశారు. ఆయా అమరవీరుల సాక్షిగా ఖమ్మంలో జరిగే శతాబ్ధి ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగే ప్రదర్శనలో పెద్దఎత్తున ఎన్టీఆర్జిల్లా నుంచి తరలిరావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రానాయక్, ఎన్టీఆర్ జిల్లా సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు, ప్రజానాట్యమండలి నిర్మాణ బాధ్యులు లంకా దుర్గారావు, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తూము కృష్ణయ్య, జిల్లా పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు చుండూరి సుబ్బారావు తదతరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, అంబోజి శివాజీ, షేక్ నాగుల్ మీరా, మేకల డేవిడ్, తిరువూరు పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్, విసన్నపేట మండల కార్యదర్శి పి.త్యాగరాజు, గంపలగూడెం మండల కార్యదర్శి జి.రామకృష్ణ, ఏ.కొండూరు మండల కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మల్నీడు యలమందరావు, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాణి, ఏఐఎస్ఎఫ్ నాయకులు మహ్మద్ యూనస్, పార్టీ సీనియర్ నాయకులు వల్లంకొండ బ్రహ్మం, పార్టీ నాయకులు పోతుబాక వెంకటేశ్వరరావు, కనకపూడి బాబూరావు, చామంతి, వాసిరెడ్డి నవీన్, ఉన్నం సాంబశివరావు, ఏఐవైఎఫ్ స్థానిక నాయకులు ఎం.మహేశ్, కె.మహేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రచారజాతా దళానికి నాయకత్వం వహించిన వారిలో ఎస్కే నజీర్, జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి శర్మ, నగర కార్యదర్శి దోనేపూడి సూరిబాబు, ఎస్కే బాషా, కాళ్ల చిన్నప్ప, సైకం రాము, సీనియర్ ప్రజానాట్యమండలి నాయకులు ఆర్.పిచ్చయ్య తదితరులున్నారు.


