Homeజిల్లాలుఅనంతపురంమట్కా మహమ్మారిని నిర్మూలించడమే లక్ష్యం..సిఐ

మట్కా మహమ్మారిని నిర్మూలించడమే లక్ష్యం..సిఐ

- Advertisement -

మూడు రోజుల్లో 70 మంది నిర్వాహకుల అరెస్టు…

విశాలాంధ్ర – తాడిపత్రి : మట్కా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే తమ ధ్యేయమని పట్టణ సీఐ ఆరోహణరావు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ జగదీష్‌, ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు మట్కా నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతున్నట్లు తెలిపారు.పేద ప్రజలకు ఒక్క రూపాయికి 90 రూపాయలు వస్తాయనే ఆశ చూపి పట్టణంలో విచ్చలవిడిగా మట్కా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఐ తెలిపారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా ప్రత్యేక దాడులు నిర్వహించి సుమారు 70 మంది మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.భవిష్యత్తులో కూడా పేదల బలహీనతలను ఆసరాగా చేసుకుని మట్కా నిర్వహిస్తే, సంబంధిత నిర్వాహకులపై రౌడీ షీట్లు తెరవడంతో పాటు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే పట్టణ బహిష్కరణ చర్యలు కూడా చేపడతామని స్పష్టం చేశారు. ప్రజలు మట్కా జోలికి వెళ్లకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని కోరిన సీఐ, ఎక్కడైనా మట్కా నిర్వహణ జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు