- Advertisement -
విశాలాంధ్ర – పెనుకొండ: పట్టణంలోని సహకార శాఖ సీనియర్ ఇన్‌స్పెక్టర్ లీలావతమ్మ చేతుల మీదుగా నూతన సంవత్సరం 2026 విశాలాంధ్ర క్యాలెండర్‌ను సీపీఐ నాయకులతో కలిసి శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా లీలావతమ్మ మాట్లాడుతూ, కార్మికులు, కర్షకులు, బడుగు–బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్నో దశాబ్దాలుగా నిరంతరం పోరాడుతున్న పత్రిక విశాలాంధ్ర అని ప్రశంసించారు. నిబద్ధత, విలువలు, ప్రజాపక్ష ధోరణితో పనిచేయడమే విశాలాంధ్ర ప్రత్యేకత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


