Homeఆంధ్రప్రదేశ్భయంతోనే అడ్డుకుంటున్నారు: సీజేపీ నేత అశుతోష్ రంకా

భయంతోనే అడ్డుకుంటున్నారు: సీజేపీ నేత అశుతోష్ రంకా

- Advertisement -

అసోంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సహ-వ్యవస్థాపకుడు అశుతోష్ రంకా సహా సుమారు 40 మంది వాలంటీర్లను ఆదివారం గువాహటిలో అసోం పోలీసులు నిర్బంధించారు. వాలంటీర్ల సమావేశానికి ముందే ఈ ఘటన జరగడం గమనార్హం. కొన్ని గంటల తర్వాత విడుదలైన అనంతరం రంకా.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు సవాల్ విసిరారు. అసోంలో కాక్రోచ్‌ల పోరాటం ఇప్పుడే మొదలైంది అని వ్యాఖ్యానించారు. సీజేపీ తమ తొలి ప్రాంతీయ వాలంటీర్ల సమావేశాన్ని గువాహటిలో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, పోలీసులు సమావేశ వేదిక వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, నేతలు ఉన్న ప్రైవేట్ నివాసం నుంచి అశుతోష్ రంకా, అన్కిత్ భరద్వాజ్, ప్రేమాకాష్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. అందరినీ కాహిలిపారాలోని 10వ అసోం పోలీస్ బెటాలియన్ క్యాంపస్‌కు తరలించారు. ఈ నిర్బంధాన్ని నిరసిస్తూ వారు నిరాహార దీక్ష ప్రారంభించారు. తమను కలిసేందుకు న్యాయవాదులను కూడా అనుమతించలేదని సీజేపీ ఆరోపించింది. నిర్బంధ సమయంలో రంకా మాట్లాడుతూ.. పాఠశాలల దుస్థితి, కజిరంగాలో భూహక్కులు, మానవ తప్పిదాల వల్ల వస్తున్న వరదల వంటి అంశాలను తాము ప్రస్తావిస్తామనే భయంతోనే సీఎం హిమంత బిశ్వ శర్మ తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాము దేనికీ భయపడబోమని స్పష్టం చేశారు. సాయంత్రం అందరినీ విడుదల చేయడంతో నిర్బంధం ముగిసింది. ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రచారాన్ని మరింత బలోపేతం చేస్తామని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని రంకా ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు