Homeజిల్లాలుకర్నూలుసీఎం సహాయ నిధి పేదలకు వరం

సీఎం సహాయ నిధి పేదలకు వరం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేశారు. పెద్దకడబూరు గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ దయ్యాల షాబీర్ బాషా భార్యకు 20, 484 వేల రూపాయలు, జాలవాడి గ్రామానికి చెందిన వడ్డే రమేష్ భార్య సునీతకు 30,028 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీలకతీతంగా పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని కొనియాడారు. ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చయితే సంబంధించిన బిల్లులు ఇస్తే వాటిని కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కన్న, మునిస్వామి , మైనార్టీ సెల్ నాయకులు నాయకులు కటిక మహబూబ్ బాషా, డిష్ వీరేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు