తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లారు. ఇదే సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్ తో కలిసి దావోస్ కు వెళ్లారు. సోమవారం జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో దిగిన చంద్రబాబు బృందానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం తారసపడింది. దీంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. మంత్రుల బృందంతో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఫొటోలు దిగారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు భుజంపై ఏపీ సీఎం చంద్రబాబు చేతులేసి, షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
దావోస్ లో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు..
RELATED ARTICLES