సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
మొంథా తుఫాను వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం అందించి వెంటనే ఆదుకోవాలని
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా సెక్రెటరీ దోనెపూడి శంకర్,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్ర బాబు,కౌలు రైతు సంఘం కార్యదర్శి పి.జమలయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు స్థానిక నాయకులతో కలిసి నందిగామ పరిసర ప్రాంతాల్లో గల ప్రత్తి,వరి పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ వాణిజ్య పంటలకు ఒక ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం,వరి పంటకు ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం అందించి తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు,రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపు చర్య లు కాకుండా పూర్తిస్థాయిలో రైతులను ఆదుకోకపోతే వ్యవసాయ రంగం అంతరించి పోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో విపత్తుకర తుపాను వచ్చి రైతులను తీవ్రంగా నష్టపరిచిందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ముంత తుఫాన్ ద్వారా 11.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 40-50 వేలు పెట్టుబడిపెట్టగా తుఫాను వారి ఆశలపై నీళ్లు చల్లిందని నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. గతంలో మాదిరిగా హెక్టారుకు 25000 కాకుండా ఒక ఎకరాకు వాణిజ్య పంటలకు 50,000 వరి పంటకు 30 వేల రూపాయలు తగ్గకుండా సాయం అందించాలని కోరారు అలాగే రంగు మారిన ప్రత్తి నీ సీసీఐ కేంద్రాల ద్వారా నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలని తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రత్తి ని కొనుగోలు చేయాలని వారు కోరారు.క్వింటా పత్తి 8110 కి కొనుగుగోలు చేయవలసి ఉండగా ఇప్పటికే దళారులు సిండికేట్ గా మారి 5 నుండి 6 వేలకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నా అధికారులు నియాత్రణ చర్యలు చేపట్టడం లేదని అన్నారు.కౌలు రైతులకు కూడా ప్రభుత్వం నిబంధనలను సడలించి వారికి న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.సొంత భూమి సాగు చేసే వారు నేడు తీవ్రంగా నష్టపోతుంటే కౌలుకు తీసుకొని భూమి సాగు చేసేవారు ఇంకెంత నష్టపోతారో ప్రభుత్వం గ్రహించాలని పరిశీలించి ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన సిపిఐ పార్టీ ఎప్పుడు ఉంటుందని రైతులకు న్యాయం జరగని పక్షంలో ప్రభుత్వాన్ని సిపిఐ ప్రశ్నిస్తుందని తెలిపారు. రైతుల పక్షాన సిపిఐ పోరాడుతుందనీ తెలిపారు.
ఈ కార్యక్రమం లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బట్టి రాయప్ప,ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవింద రాజులు,చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర నాయకులు తాడి పైడియ్య,ఎయిటక్ నాయకులు కొట్టు రమణారావు, సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కట్టా చామంతి,షేక్ గులామ్మహ్మద్,మన్నె హనుమంతరావు,వాసిరెడ్డి నవీన్,మౌలాలి, నాగు తదితరులు, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు.



