Homeజిల్లాలుశ్రీ సత్యసాయికౌన్సిల్ హాల్లో అజెండా ను కౌన్సిలర్లు తీర్మానించక, బాయ్ కాట్

కౌన్సిల్ హాల్లో అజెండా ను కౌన్సిలర్లు తీర్మానించక, బాయ్ కాట్

- Advertisement -

మొదట అజెండా అంశాలపై చర్చించాలన్న కమిషనర్, కూడదు అన్న చైర్మన్ కౌన్సిలర్లు

మాటల యుద్ధముతో ముగిసిన కౌన్సిల్ సమావేశం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో అజెండాకు సంబంధించిన 23 అంశాలను చదవక ముందే, కౌన్సిలర్లు అడ్డుకొని, తొలుత కేబుల్ అజెండాను పై చర్చ జరపాలని మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణను కోరగా, కూడదు మొదట 23 అంశాలపై చర్చ జరగాలని, ఆ తర్వాతనే చట్టం ప్రకారం చర్యలు తీసుకొని న్యాయం చేస్తామన్న తెలపడంతో, అజెండాను తాము తీర్మానించాము అని కౌన్సిలర్లు తెలపడంతో, అటు కౌన్సిలర్లు, ఇటు మున్సిపల్ కమిషనర్ తో పాటు అధికారులు కూడా బాయ్కాట్ చేసి వెళ్లిపోవడం జరిగింది. తొలుత మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి మాట్లాడుతూ కౌన్సిల్ సమాచారాన్ని మూడు రోజులు ముందుగా తెలపాలని ఎన్నో సమావేశాల్లో తెలిపిన కూడా అధికారులుగా మీరు ఎందుకు స్పందించడం లేదని వారు నిలదీశారు. అంతేకాకుండా తాము ఇచ్చిన టేబుల్ అజెండాను చర్చించాలని, ఇది ప్రజలకు సంబంధించిన విషయం అని తెలిపిన కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదని, దీని వెనుక ఎన్డీఏ కూటమి నాయకుల అస్తముందా?? అని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అజెండా ఆమోదముకు తాము అడ్డు కాదని, పట్టణ అభివృద్ధికి అడ్డు కాదని, అజెండాకు ముందు పట్టణ సమస్యలు మాట్లాడితే తప్ప?? అని అధికారులను వారు నిలదీశారు. అంతేకాకుండా చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ జయరాం రెడ్డి, కౌన్సిలర్ చందమూరి నారాయణరెడ్డి, కౌన్సిలర్ లు మాసపల్లి సాయికుమార్, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కుక్కల ఆపరేషన్ కొరకు 18 లక్షలు ఖర్చు చేశారని, ఆ ఖర్చుకు లెక్క చెప్పరా?? ఎన్ని కుక్కలకు వైద్యం చేశారు. అన్న వివరాలు మీరు ఎందుకు చెప్పడం లేదు అని వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే పట్టణంలో వీధి లైట్లు, తాగునీటి సమస్య, తదితర సమస్యలను ఎప్పుడు చర్చించిన దానికి పరిష్కారం ఎందుకు అధికారులు చూపడం లేదో అని వారు మరోసారి అధికారులను ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరమును ఎంతగానో అభివృద్ధి చేసి మంచి గుర్తింపును ప్రజల వద్ద పొందారని, అటువంటి మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల ప్రసీని ఎందుకు మీరు తొలగించాలని వారు ప్రశ్నించారు. మరి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఫ్లెక్సీలు ఇప్పటివరకు సమయం అయిపోయిందని అయినా కూడా ఫ్లెక్సీలు ఎలా కొనసాగుతున్నాయని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా ఎక్కడబడితే అక్కడ అతి పెద్ద ఫ్లెక్సీలు పెట్టడం మీకు సమంజసమేనా? ఆ ఫ్లెక్సీలు కట్టినవాళ్లు మున్సిపల్ కార్యాలయానికి చలానా కట్టారా? ఎంత కట్టారు అన్న వివరాలను అధికారులు అడిగినా కూడా వారి నుండి సమాధానం లేకపోయింది అని వారు తెలిపారు. ఇక టేబుల్ అజెండాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి హయాంలో 12,000 మందికి ఇంటి స్థలము మంజూరు చేయడం జరిగిందని, కొనుతురు లేఔట్ లో 1834, రేగాటిపల్లి లేఔట్ లో 2905, పోతుల నాగేపల్లి లేఅవుట్ లో 6494 మందికి ఇంటి స్థలాలు ఇప్పించడం జరిగిందని వారు గుర్తు చేశారు. కానీ వారికి కావలసిన గ్యాస్ సర్వీస్ కొరకు పిల్లల చదువులకు అవసరమైన ఆధారు చిరునామా ఒక అడ్రస్ కావాలి అంటే ఆ కాలనీలను మన మునిసిపల్ పరిధిలోనికి కలుపుకొని వారికి కల్పించి అన్ని వార్డులతో సమానంగా ఓటర్లు ఉండే విధంగా అవసరమైతే వార్డులతో సమానంగా వార్డుల సంఖ్య పెంచాలని తెలిపారు. డి లిమిటేషన్ చేసి ఆ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని తెలిపారు. ఇటువంటి ఈ టేబుల్ అజెండాను చైర్మన్గా, కౌన్సిలర్లుగా మేము అడగడం తప్ప? ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలి అని అడిగారు. మొత్తం మీద కౌన్సిలర్లకు కమిషనర్లకు మాటల యుద్ధం అధికం కావడంతో అధికారులు తయారుచేసిన అజెండాను తాము తిరస్కరిస్తున్నామని, ఇందుకు తాము బాయ్కాట్ చేస్తున్నామని వారు వెళ్ళిపోయారు. తదుపరి చేసేది లేక అధికారులు కూడా బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. కౌన్సిల్ సమావేశానికి ముందే కమిషనర్ను అధికారులను చైర్మన్ ను కౌన్సిలర్లు చైర్మన్ ఛాంబర్ లోకి పిలిపించుకొని పోతుల నాగేపల్లి, కొనుతురు, రేగాటిపల్లి కాలనీలను మున్సిపాలిటీ లోకి చేర్చేలా అజెండాలో ఎందుకు పొందుపరిచారని వారు అడిగారు. కౌన్సిల్ సమావేశంలో టిపిఓ ఎందుకు హాజరు తెలిపారు. ప్రతి కౌన్సిల్ సమావేశానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరైనప్పుడే పట్టణములోని సమస్యలు సులభతరంగా చర్చించే అవకాశం ఉంటుందని తెలిపారు. 11 గంటలకు సమావేశం కావలసిన కౌన్సిల్ సమావేశం 12 గంటలకు మొదలైంది. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని కౌన్సిలర్లు దుయ్యబట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ విభాగంలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు