శ్రీ సత్యసాయి సేవా సమితి -2
విశాలాంధ్ర ధర్మవరం;; అల్పాహారం పంపిణీ చేయడంలోనే తృప్తి ఉందని శ్రీ సత్య సాయి సేవాసమితి-2 సుబ్బదాసు భజన మందిరం పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు పాలు బ్రెడ్డు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సేవాదాతగా ఏ. సత్యనారాయణ, రాధా రాణి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి -2 వారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమం రోగులకు వరంగా మారిందని, వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది దాతలు ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
అల్పాహారం పంపిణీ చేయడంలోనే తృప్తి ఉంది
- Advertisement -
RELATED ARTICLES


