ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యార్థులచే గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 4వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛ భారత్ – పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా నిర్వహించడం జరిగిందన్నారు.అందులో భాగంగా గొట్లూరు గ్రామంలోని ఆర్చ్ మెయిన్ రోడ్ నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకు, సచివాలయం ప్రాంగణం, అంబేద్కర్ భవనం చుట్టుపక్కల వున్న చెత్త చెదారం, వ్యర్థ పదార్థాలు, పిచ్చి మొక్కలు తొలగించి, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయడం జరిగిందన్నారు. దోమల నివారణలో భాగంగా వర్షా కాలంలో వచ్చే జబ్బుల గురించి గ్రామప్రజల్లో అవగాహన కల్పించామన్నారు. కలుషిత నీరు , కలుషిత గాలి వల్ల సంక్రమించే వివిధ రకాల వ్యాధుల నుండి తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి వివరించామన్నారు. వివరించడమైంది. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎ . కిరణ్ కుమార్, యం. భువనేశ్వరి, ఎం. పుష్ప, బి . ఆనంద్ , సరస్వతమ్మ, నల్లమ్మ, తదితర అధ్యాపక, అధ్యాప కేతర బృందం, ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు ,విద్యార్థులు పాల్గొన్నారు.
గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమం ..
- Advertisement -
RELATED ARTICLES


