మత్స్యపరిశ్రమ ద్వారా 3 లక్షల కోట్ల సంపద వున్నా మత్స్యకారుల బతుకులు మారలేదు
– ఆచార్య కె.యస్.చలం
తూర్పుతీరం లో విధ్వంసం జరుగుతుందని, ఇక్కడ బతుకుతున్న మత్స్యకారులు దశాబ్దాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, భారత్ లో మూడు లక్షల కోట్ల సంపద సృష్టిస్తున్నా గత కొన్ని శతాబ్దాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఒక సమూహం భారత్ లో ఉంది అంటే అది సాంప్రదాయ మత్స్య కారులేనని యూపీఎస్సీ మాజీ సభ్యుడు, మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కేఎస్ చలం అన్నారు.హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో గురువారం వ్యవసాయ మార్కెటింగ్ పై 39వ వార్షిక సమావేశంలో ఆచార్య చలం ప్రొఫెసర్ జి. పార్థసారథి మెమోరియల్ లెక్చర్ యిచ్చారు. దేశంలో దళిత, ఆదివాసీ గ్రూపుల్లో నమోదు చేయబడినా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేని వారు ఒక్క మత్సకారులే అన్నారు. ప్రొఫెసర్ పార్థసారథి ఆంధ్ర విశ్వవిద్యాలయం లో పనిచేసి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ఆర్ధిక శాస్త్రవేత్త అని ఆచార్య చలం గుర్తు చేశారు. ఆయన తనకు సన్నిహితులని, ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ గోగుల రమణ ఆయన కుమారుడే అని తెలిపారు.సాంఘిక ఆర్ధిక దృక్కోణంలో భారత్ దేశం లో మత్స్య మార్కెటింగ్ అనే అంశం పై చలం ప్రసంగించారు.
తూర్పు తీరం లో జరుగుతున్న విధ్వంసం వల్ల కొన్ని శతాబ్దాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు. ముఖ్యంగా ప్రపంచం లో చేపలు తినని జనాభా ఒక్క ఇండియా లోన్ ఉన్నారని, భారత్ సగటున 72 శాతం అయితే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అతి తక్కువగా 30 నుండి 50 శాతం మంది మాత్రమే చేపలు తింటారన్నారు. తూర్పు తీరం లోని అస్సాం నుండి తమిళనాడు కేరళ వరకు 90 శాతం ప్రజలు ముఖ్యం గా బెంగాల్ లో బ్రాహ్మలు పశ్చిమ తీరం లో కొంకణి బ్రాహ్మలు ప్రతి రోజు చేపలు తింటారని చెబుతూ ఇలాంటి వైవిధ్యం ఉన్న దేశం లో చేపలు పట్టి అమ్ముకునే మత్స్యకారులకు ఏవిధమైన ప్రోత్సాహం ,ముఖ్యం గా మార్కెట్ కు సంబంధించి ప్రోత్సాహం లేదని చెప్పారు. చేపలు అమ్మేది ఆచ్ఛాదన లేని మహిళలే అని, వారిని కొన్ని ప్రాంతాల్లో వీధుల్లోకి కూడా రానీయరని, అందుకే వీరికి ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చెయ్యాలని కోరారు. అందుకు 15 అంశాలతో కూడిన సిఫార్సులు చేసారు . ముఖ్యంగా ఇప్పుడు భారత్ ,ప్రపంచంలోనే అత్యధికం గా చేపలు ఉత్పత్తి చేసే రెండో అతిపెద్ద దేశం గా మారిందని, మత్స్యపరిశ్రమ ద్వారా మూడు లక్షల కోట్ల సంపద మత్సకారులు సృష్టిస్తున్నా వారి సగటు ఆదాయం పేదరికానికి దిగువనే ఉండటానికి ఒకానొక కారణం వారి సాంఘిక వెనుకబాటుతనం అన్నారు . పెత్తందార్ల ఆధీనం లో నడిచే మార్కెట్లో వారి శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని చెప్పారు. ముఖ్యంగా దేశంలో ఆంధ్ర ప్రదేశ్ మత్స్య సంపద లో మొదటి స్థానం విదేశీ ఎగుమతి అవుతున్న 63 వేల కోట్ల రూపాయల విలువలు సగం ఆంధ్ర రాష్ట్రానికి చెందింది . దీనికి కారణం రెండు జిల్లాలు కృష్ణ పశ్చిమ గోదావరి . ఈ రెండు జిల్లాల్లో ఉన్న సుమారు 9 వేల చదరపు కిలోమీటర్లు ఉన్న కొల్లేరు సరస్సును అక్కడి మత్స్య కారులను తరిమేసి కొంత మంది నీతి బరులు రస్జాకీయ నాయకులు వేల ఎకరాలు సాగు ఆడే చేపల సాగు చేస్తూ లక్షల కోట్లు సంపాదిస్తున్నారని గానీ మతాల కార్లకు ఇప్పుడు అక్కడ కూలి పని చేసుకునే దళితులకు ఏవిధం గాను మేలుచేయటం లేదని, దేశం లో ప్రభుత్వ ప్రజల సొత్తు పర్యావరణం విధ్వంసం జరిగింది అన్నారు. వీరిని ఎవరూ పట్టించుకోవటం లేదని , దీనిపై డజన్ల కొద్ది పరిశోధన పత్రాలు కేంద్ర ప్రభుత్వ, సుప్రీమ్ కోర్ట్ కేసులు ఉన్నా ఒకడుగు ముందుగు జరగడం లేదని చెప్పారు . ఆంధ్ర రాజకీయాలను యీ డబ్బు నడిపిస్తున్నట్లు పరిశోధనలు ఉన్నాయి అన్నారు . ఉత్తరాంధ్ర తూర్పుతీరం మొత్తం అదానీ కి ధారాదత్తం చేసి మత్స్యకారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అన్నారు . మత్సకారుల్లో ఎటువంటి చైతన్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వారానికి నాలుగు రోజులు వేటకు వెళ్లి ఒట్టి చేతులతో వస్తున్న మత్స్యకారులు థండేల్ వంటి సంఘటనలు మునుముందు పెరుగుతాయని దీనిపై కేంద్రప్రభుత్వం మనసు పెట్టి మత్స్య సంపద సమృద్ధి యోజన క్రెడిట్ కార్డ్ యివ్వటం తో మార్పు పెద్దగా రాలేదు అన్నారు. ఎందుకంటే ప్రజల సంపద అయిన చెరువులు నదులు తో వారు సముద్రం లోకి పెత్తందార్లు వారి పెట్టుబడి వచ్చినపుడు స్థానికులు అయి నా పేద మత్స్యకారులు తొలగించి మొత్తం పెట్టుబడి దార్లు సొంతం చేసుకుంటున్నారు. కాబట్టి రాజ్యంగపరంగా జీవించే హక్కుగా గల మత్స్యకారులను ప్రభుత్వమే సంస్థాగత మార్పులు ద్వారా మత్స్య కారు లను వారి మార్కెటింగ్ కు కావలసిన వసతులను కల్పించాలని చెప్పారు . ఈ సామావేశానికి ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ శ్రీదేవి ప్రొఫెసర్ మల్లయ్య, విజయ్ సత్యనారాయణ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పరిశోధకులు పాల్గొన్నారు . ఆచార్య చలం ఉపన్యాసం, నూతన పరిశోధన మార్గాలను సూచించిన చలం అందరూ అభినందించారు


