Homeజిల్లాలుఅనంతపురంమిట్స్‌సెట్–2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభం

మిట్స్‌సెట్–2026 అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభం

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సం. నిర్వహించిన మిట్స్‌సెట్–2026 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 27న నుండి జూన్ 3వ వరకు నిర్వహించనున్నట్లు మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్. డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. బీటెక్, బీబీఏ, బీసీఏ, ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ విధానాల్లో కౌన్సెలింగ్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ, అడ్మిషన్ గైడెన్స్ మరియు సీట్ అలాట్‌మెంట్ వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, మిట్స్‌సెట్ స్కోర్ కార్డ్ మరియు గుర్తింపు పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కళాశాల అధికారిక మిట్స్ వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయని రిజిస్ట్రార్ డాక్టర్. డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. ప్రెస్ మీట్ లో ప్రో ఛాన్సుల్లర్ ద్వారకానాథ్, వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ సి. యువరాజ్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు