Homeజిల్లాలుఅనంతపురంబక్రీద్ సందర్భంగా గోవధ నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

బక్రీద్ సందర్భంగా గోవధ నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- Advertisement -

: శింగనమల సీఐ కౌలుట్లయ్య…

విశాలాంధ్ర – నార్పల ( అనంతపురం జిల్లా ):- జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టినట్లు శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు. ఆవులు, దూడలు, ఒంటెల వధ పూర్తిగా నిషేధించబడిందని, ఇది చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. శింగనమల, నార్పల, గార్లదిన్నె మండలాల పరిధిలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండలాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు, రాత్రి గస్తీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్రమంగా పశువుల రవాణా, గోవధ, అనుమతి లేని ప్రదేశాల్లో వధ వంటి చర్యలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు.
జంతుహింస నివారణ చట్టంఉ1960, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం మరియు పశు సంరక్షణ చట్టంఉ1977 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశువులకు అనవసరమైన నొప్పి, హింస కలిగించకుండా ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
లైసెన్స్ లేని వధశాలల్లో పశువులను వధించడం, బహిరంగ ప్రదేశాల్లో జంతువులను హింసించడం, నిబంధనలు పాటించకుండా మాంసం విక్రయించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని హెచ్చరించారు. పశువైద్యుల ధృవీకరణ పొందిన పశువులను మాత్రమే అనుమతించిన ప్రదేశాల్లో వధించాలన్నారు.
అంతేకాకుండా, అక్రమంగా పశువులను తరలించే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అనుమానాస్పదంగా కనిపించే వాహనాలను తనిఖీ చేసి అవసరమైతే స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మత సామరస్యాన్ని కాపాడాలని సూచించారు. ప్రజలందరూ పరస్పర గౌరవంతో పండుగను నిర్వహించి పోలీసు శాఖకు సహకరించాలని శింగనమల సీఐ కౌలుట్లయ్య విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు