విశాలాంధ్ర,కదిరి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందాలను అరికట్టాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంగళవారం సీపీఐ డివిజన్ కార్యదర్శి నల్లజోడు పవన్, సహాయ కార్యదర్శి హసన్, పట్టణ కార్యదర్శి లియాకత్ ఆలీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ లావాదేవీలు ఎక్కువ శాతం సాగుతున్నట్లు రోజు రోజుకు ఆరోపణలు వెలువెత్తున్నా ఇక్కడ అడిగేవారు లేక పోవడంతో ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం లో ప్రతి డాక్యుమెంటుకు ముక్కుపిండి రెట్టింపు వసూళ్లు చేస్తున్నారంటూ అనేక మార్లు పత్రికల్లో వస్తున్నా అక్రమాలపై విచారణ చేపట్టేవారే లేరన్నారు. ఓవైపు ప్రవేటు ఉద్యోగుల హావా నడుస్తుండగా, మరోవైపు కొందరి డాక్యుమెంట్ రైటర్ల జోక్యం పెరిగిపోవడం వంటి కారణాలతో కార్యాలయం పని తీరు అస్తవ్యస్తంగా తయారైందన్నారు.రికార్డ్ గదిలోని ఆర్ హెచ్, మాన్యువల్ ఈ సి,నకలు వ్యవహారమంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తున్నట్లు తెలిపారు. ముడుపులు చెల్లించిన వారికి రెండు మూడు రోజుల్లోనే ఎంతటి పాత సమాచారం అయినా ఇస్తున్నారని, కేవలం ప్రభుత్వ ఫీజులు చెల్లించిన వారికి వారాలపాటు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. కొంతమంది అధికారులు బయట వ్యక్తులతో జతకట్టి వారి అడుగులకు మడుగులోత్తుతు వారి దందాలకు సహకరిస్తున్నారని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా నాయకులు మధు నాయక్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రమణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహేంద్ర, రైతు సంఘం జిల్లా నాయకులు చంద్ర, మహిళా సంఘ నాయకురాలు శోభకొండయ్య,శ్రీను,షబ్బీర్ పాల్గొన్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందాలపై సిపిఐ ధర్నా
- Advertisement -
RELATED ARTICLES


