విశాలాంధ్ర పుట్టపర్తి: – బుక్కపట్నంలో డ్వాక్రా సంఘానికి సంబంధించిన డబ్బులు స్వాహా ఘటనకు సంబంధించి అధికారులు తీరుపై నిరసన తెలియజేసేందుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు పై భౌతికదాడులకు పాల్పడిన సీసీ, బుక్ కీపర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపు సభ్యులకు సంబంధించి పెద్ద మొత్తంలో నగదు స్వాహా ఘటన పై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ డిమాండ్ చేశారు. డ్వాక్రా గ్రూపునకు సంబంధించి ఓ మహిళ ఎనిమిది లక్షల రూపాయలు స్వాహా చేసి ఇల్లు నిర్మించుకుందని, ఇతర గ్రూపు సభ్యులు ప్రశ్నిస్తే ఆ ఇంటిని అమ్మి డబ్బు గ్రూప్ ఖాతాలో జమ చేస్తానని చెప్పిన ఈ క్రమంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఇతర మహిళలపై దాడికి పాల్పడ్డారన్నారు. ఇందులో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతినెల డ్వాక్రా గ్రూపునకు సంబంధించిన నగదు జమ చేసే క్రమంలో ఏపిఎం, సిసి ఇతర అధికారులు పరిశీలించాల్సి ఉన్న పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికారుల తీరుపై నిరసన తెలియజేసేందుకు వెళితే ప్రజా సంఘాల నాయకులపై భౌతిక దాడులకు దిగి బెదిరింపులకు గురి చేయడమేంటని ప్రశ్నించారు. తక్షణమే పోలీసులు వారిపై కేసు నమోదు చేయాలన్నారు.
సిపిఎం నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి..
- Advertisement -
RELATED ARTICLES


