- Advertisement -
విశాలాంధ్ర శింగనమల… బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఎస్ఆర్ఐటి కళాశాలలో మంగళవారంవిద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది, ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి(20) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన ను గమనించిన తోటి విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు, అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు నిర్ధారణ అయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం బౌతిక కాయాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, కేసు నమోదు చేసుకొని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


