విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పనిచేస్తున్న 20 మంది పారిశుధ్య కార్మికులు మంగళవారం సిఐటియు నుండి ఏఐటియుసి సభ్యత్వం స్వీకరించారు, ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో పని చేస్తున్న కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు,ఆప్కాస్ లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు,అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమలుచేయడం లేదన్నారు,మున్సిపల్ కార్మికులకు పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నారు,12 వ పిఆర్సీ కమిటీ వేసి తక్షణమే ఐఆర్ ప్రకటించాలన్నారు,కార్మికుల సమస్యలపై ఏఐటియుసి చేస్తున్న పోరాటం చూసి కార్మికులు ఏఐటియుసి లో చేరుతున్నారన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతు,గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి నాయక్, ఏ ఐ టి యు సి నియోజకవర్గ నాయకులు బుడేన్,కళ్యాణదుర్గం మున్సిపల్ యూనియన్ నాయకులు రామాంజనేయులు,నగేష్,వెంకటేష్,కాంతమ్మ,లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు…
ఏఐటియుసి లో చేరిన పారిశుధ్య కార్మికులు
- Advertisement -
RELATED ARTICLES


