పట్టణంలో సిపిఐ రెండవ జిల్లా మహాసభలు ర్యాలీ
పూలవర్షం కురిపించిన పట్టణ ప్రజలు
విశాలాంధ్ర ధర్మవరం;; భారత కమ్యూనిస్టు పార్టీ రెండవ జిల్లా మహాసభలు ధర్మవరం పట్టణంలో అత్యంత వైభవంగా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ ర్యాలీలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, నియోజకవర్గ కార్యదర్శి మధు, జింక చలపతి, రవికుమార్, రమణ, వెంకటనారాయణ, జిల్లాలోని సిపిఐ మండల కార్యదర్శి, నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలతో మార్మోగించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో గల శివాలయం నుండి పట్టణ పురవీధులలో వందల సంఖ్యలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు జిల్లాల నుండి తరలివచ్చిన సిపిఐ శ్రేణిలుభారీ ర్యాలీని నిర్వహించారు. పట్టణ పురవీధులలో ర్యాలీగా వచ్చిన సిపిఐ పార్టీ శ్రేణులకు ప్రజలు పూలవర్షముతో స్వాగతం పలికారు. పటాసులు పేరుస్తూ జిల్లా మహాసభలకు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో గుత్తి, పత్తికొండ, కళాకారుల ప్రజానాట్యమండలి బృందం, రాందాస్, బాల రంగడు, ఓబులేసు, సుంకన్న, నాగేశ్వరరావుల నాట్యం అందరిని ఆకట్టుకుంది. ధర్మవరం పట్టణం ఎటుచూచిన ఎరుపు జెండాలతో మారుమోగింది. డప్పు వాయిద్యాలతో, నాట్యంతో పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున జిల్లాల నుండి మహిళల తో పాటు అధిక సంఖ్యలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.


