Homeఆంధ్రప్రదేశ్రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది..?

రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది..?

- Advertisement -

బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో పరిపాలన గాడి తప్పింది.

ఏపీ ప్రభుత్వం సంవత్సర కాలంలో 1.70 వేల కోట్ల అప్పు చేసింది.

146 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ట్రంప్ బెదిరింపులకు గురి చేస్తున్నారు.

ట్రంపు కు ప్రధానమంత్రి మోడీ సమాధానం ఇవ్వకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు.? దేశ ప్రజలకు సమాధానం ఇచ్చి తీరాలి.

ఆంధ్ర ప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.

విశాలాంధ్ర ధర్మవరం;; రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని, బిజెపి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల కాలంలో పరిపాలన గాడి తప్పింది అని, ఒక సంవత్సర కాలంలో 1.70 వేలకోట్ల అప్పు తేవడం జరిగిందని ఏపీ. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటుచేసిన భారత కమ్యూనిస్టు పార్టీ రెండవ జిల్లా మహాసభలకు వారు ముఖ్యఅతిథిగా రామకృష్ణ తోపాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్, జాన్సన్ బాబు, ఏఐకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, చేనేత చేతివృత్తి రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, ఐపిటిఏ రాష్ట్ర కార్యదర్శి చంద్రనాయక్ తదితరులు విచ్చేశారు.విచ్చేశారు. ఈ మహాసభకు సభ అధ్యక్షులుగా శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం వేమయ్య యాదవ్ ఆధ్వర్యంలో నడిచింది. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల పాలిట శాపంగా మారాయని, కార్పొరేట్ సంస్థలకు ఊడిగగా మారాయని వారు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంలో 21సార్లు ఢిల్లీకి వెళ్లి 1.70 వేలకోట్ల అప్పు తెచ్చారని, రాజధాని కోసం 31 వేల కోట్లు అప్పు, ఆంధ్రాలో 26 జిల్లాలలో ట్రూ అప్ చార్జీ పేరుతో 15,480 కోట్లు పెంచడం ఎంతవరకు సమంజసమని వారి ప్రశ్నించారు. 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ట్రంప్ బెదిరింపులకు చేస్తున్నారని, మరి ప్రధానమంత్రి మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని వారు నేరుగా ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తీరుతామని వారు సవాల్ విసిరారు. పార్లమెంటులో ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారని అతని పేరు కూడా ఎత్తలేకపోవడం పిరికితనం కాదా అని వారు ప్రశ్నించారు. కష్టజీవుల ప్రభుత్వం రావాలి, కార్మిక రాజ్యం ఏర్పడాలి అని వారు పిలుపునిచ్చారు. వందేళ్లుగా పోరాటం మరో వందేళ్లు పోరాడుతామని వారు తెలిపారు. పేద ప్రజలకే సిపిఐ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. పేద ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎంతటికైనా సిపిఐ పార్టీ తెగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 26 జిల్లాల సిపిఐ మహాసభలు పూర్తి కావడం జరిగిందని తెలిపారు. ఈ మహాసభలలో సమస్యలకు పరిష్కారం చూపేందుకు తగిన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందని తెలిపారు. 2014 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని తెలిపారు. ధరల తగ్గింపు, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, 70 లక్షల కోట్ల నల్లధనాన్ని మార్చి, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జన ధన ఖాతాల ద్వారా జమ చేస్తాం హామీలు ఏమయ్యాయి అని సూటిగా ప్రశ్నించారు. క్రియాశీలక ఉద్యమాలకు సిపిఐ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని తెలిపారు. కష్టజీవులకు అండ ఎర్రజెండా ఎప్పుడూ ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలు అమలు చేయకుండా ప్రజలపై విద్యుత్ వారాలు మోపాడు అని తెలిపారు. భారతదేశంలో వందేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు కాంగ్రెస్, సిపిఐ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సిపిఐ పోరాటం చేసిందన్నారు. సిపిఐ పార్టీ అధికారం కోసమో, డబ్బు కోసమో, ఆరాటపడలేదని, అధికారులు లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు కేంద్రంలో బిజెపి 11 సంవత్సరాల పరిపాలన కొనసాగించింది కదా పేద ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని వారు తెలిపారు. రైతుల సమస్యలకు పరిష్కారం, నల్లధనం, జనధన్ ఖాతాలకు నగదు జమ ఏమైందని వారు తెలిపారు. యువతకు ఉద్యోగాలు లేవని, ధరలు తగ్గింపు లేదని, అవినీతిని నిర్మూలన చేయుటలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలము అయ్యారని మండిపడ్డారు. నేడు దేశంలో రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారని, కానీ అదాని, అంబానీతో పాటు 72 శాతం మంది కోటీశ్వరుడు ఆస్తుల రెట్టింపు అయ్యాయని తెలిపారు. పాకిస్తాన్తో యుద్ధం చేయమని దేశంలో అన్ని పార్టీలు చెబితే, ట్రంపు ఫోటో మోడీ యుద్ధం విరమించుకోవడం ఏమిటో అర్థం కావడం లేదని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయ పరిపాలన ఉన్నా కూడా పరిపాలన గాడి తప్పడం ప్రజల దురదృష్టమని తెలిపారు. మోడీకి తానా అంటే తందానా అంటూ వంత పాడుతూ డబ్బులు ఇంజన్ సర్కారును నడపలేక కోట్ల అప్పు రాష్ట్రానికి మార్చారని వారు మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా విద్యుత్ ఛార్జీలు రూ.15,480 కోట్లు పెంచాడని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి సింగపూర్లో ఉపముఖ్యమంత్రి సినిమాల్లో ఉన్నారని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా రాష్ట్ర విభాగం నాయకురాలు పద్మావతమ్మ, ప్రజానాట్యమండలి ప్రేమ్ కుమార్, రాందాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మహేంద్ర, జిల్లా అధ్యక్షులు మూర్తి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సకల రాజా, నరసింహులు, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా నాయకురాలు జయలక్ష్మి, డిహెచ్పిఎస్ అంజన్ బాబు, రామకృష్ణ,ప్రజా సంఘాలు దాదా పీర్, వినోద్ ,సురేంద్ర చౌదరి, ఆంజనేయులు, కదిరప్ప, బాలస్వామి, పవన్, మహదేవ్ కమతం కాటమయ్య, ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి రమణ, శ్రీనివాసులు,చేనేత జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, చేనేత జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, సత్యసాయి జిల్లాల నుండి సిపిఐ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు