కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యాయి
సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య, జగదీష్
విశాలాంధ్ర ధర్మవరం;; పేదల పాలిట అజెండా అనే సిపిఐ పార్టీ ముఖ్య లక్షమోని, ఎర్రజెండా తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పరిపాలనలో పూర్తిగా విఫలమయ్యాయని శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య, జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరు ధర్మవరం పట్టణంలో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ రెండవ జిల్లా మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నాయని, పేదవానికి ఎటువంటి లబ్ధి చేకూరటం లేదని వారు మండిపడ్డారు. మోయలేని విద్యుత్ వారాన్ని ప్రజలపై మోపడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. కేంద్రము, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కి ప్రజలను ఇబ్బందుల్లో పెట్టడం సమంజసమేనా అని వారు ప్రశ్నించారు. పేదల ఐక్యత కొరకే సిపిఐ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. పేదలకు కూడు, గుడ్డ, విద్య, వైద్యం అందించుటలో రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలిపారు. నేడు రైతు వర్షాలు కురవక, పంటలు రాక, ఉపాధి నిమిత్తం నగరాలకు వలస పోతున్న పట్టి పట్టినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉంటాయని వారు నిలదీశారు. ప్రగల్బాలు పలకుండా పేదల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తేనే, కేంద్రం రాష్ట్ర అభివృద్ధి బాటలో నడుస్తుందని వారు సలహా ఇచ్చారు. అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు దూరంగా ఉండడం, అప్పుల పాలు కావడం జరిగిందని, మరి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇదే దారిలో పోతోందని వారు తీవ్రంగా విమర్శించారు. ప్రజల జీవనోపాధికి కావలసిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అప్పుడే పేదరికం నిర్మూలించే అవకాశం ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేతివృత్తి, చేనేత రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శిలు రమణ, శ్రీనివాసులు, చేనేత జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, పెద్ద సంఖ్యలో సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు.


