Friday, January 16, 2026
Homeఆంధ్రప్రదేశ్ధర్మవరంలో వైభవంగా నిర్వహించనున్న చేనేత దినోత్సవం

ధర్మవరంలో వైభవంగా నిర్వహించనున్న చేనేత దినోత్సవం

- Advertisement -

చేనేత దినోత్సవానికి ఏర్పాట్లను పరిశీలించిన హరీష్ బాబు

మంత్రి పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించిన హరీష్ బాబు.
విశాలాంధ్ర ధర్మవరం; ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ధర్మవరం పట్టణంలోని కదిరి గేటు వద్ద ఘనంగా నిర్వహించనున్న చేనేత దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని, కార్యక్రమ స్థలంలోని ముందస్తు ఏర్పాట్లను హ్యాండ్లూమ్ అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ తో పాటు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి ఆగమనానికి అనుగుణంగా భద్రతా చర్యలు, వేదిక ఏర్పాట్లు, అతిథుల సమాహార నిర్వహణ వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్థానిక బీజేపీ నేతలు, హ్యాండ్లూమ్ శాఖ అధికారులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. చేనేత వృత్తి ప్రజల జీవనాధారంగా నిలుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, వారి పట్ల సంఘీభావం వ్యక్తం చేసేందుకు, ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ చేనేత దినోత్సవం ఒక ముఖ్యమైన వేదికగా నిలువనున్నదని హరీష్ బాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ.డి రామకృష్ణ, చేనేత అభివృద్ధి నాయకులు శినా నాయక్, సుబ్బానాయుడు, సి.డి.ఈ శివ గోవర్ధన్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేష్, పట్టణ అధ్యక్షులు చంద్ర, ఆకులేటి వీరనారప్ప, పోతుకుంట రాజు, జూటూర్ వెంకటేష్, సోమ్లా నాయక్, నారప్ప, రవి, కొండమీద రాయుడు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు