పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే పార్టీ సిపిఐ…
సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్
విశాలాంధ్ర- అనంతపురం : 12, 13 తేదీలలో అనంత జిల్లా సిపిఐ మహాసభలను జయప్రదం చేయాలని, పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే పార్టీ సిపిఐ అని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పేర్కొన్నారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్, జిల్లా సహాయ కార్యదర్శి లు పి నారాయణస్వామి, మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాజారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ… సిపిఐ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో 1925 డిసెంబర్ 26న స్థాపించబడిందన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సంపూర్ణ స్వతంత్రం కావాలని పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ అని పేర్కొన్నారు. నైజాం వ్యతిరేకంగా, పెట్టి చాకిరికి వ్యతిరేకంగా పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి పెట్టిన పార్టీ సిపిఐ కె ఘనత దక్కిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 1936 అనంతపూర్ జిల్లాలో ఐదు కల్లు సదాశివం, నీలం రాజశేఖర్ రెడ్డి, డీకే ఆదినారాయణ రెడ్డి లు పెత్తందారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పేద ప్రజల పక్షాన వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా జిల్లాలోని మండల స్థాయి నియోజకవర్గాలలో సభలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈనెల 12 13 తేదీల్లో జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏడాదికావస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో కోత పెడుతున్నారన్నారు . ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు రైతులకు రూ. 7 వేలు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. ఇంతవరకు రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదన్నారు. కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు. ప్రతి మహిళకు పింఛన్ 1,500 ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. వెంటనే ప్రతి మహిళకు నెలకు పింఛన్ వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం కాలంలో 15 వేల 486 కోట్ల రూపాయలు పెంచడం జరిగిందన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపు వెనక్కి తీసుకోవాలని, పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలన్నారు. ఈ అంశాలపై జిల్లా మహాసభలో చర్చించడం జరుగుతుందన్నారు. వామపక్షాలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేస్తామన్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వ ఎమ్మెల్యేలు నగరంలో అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పడమే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో అక్కడున్న ప్రజలు రోగాల పాలవుతున్నారన్నారు. డంపింగ్ యార్డును రీసైకిలింగ్ చేయడానికి గత ప్రభుత్వంలోనే రూ 28 కోట్లు మంజూరు అయిందన్నారు. తక్షణమే డంపింగ్ యార్డ్లో రీసైకిలింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ పథకంలో కోట్ల రూపాయల పైగా బిల్లులు బకాయిలు ఉండడంతో ప్రవేట్ ఆసుపత్రులలో ప్రజలకు సరైన వైద్యం అందించలేకపోతున్నారన్నారు. సూపర్ స్పెషాలిటీ, ప్రభుత్వ సరోజన ఆస్పత్రులలో వైద్య సిబ్బందిని, ఏర్పాటు చేయాలని వివిధ అంశాలతో కూడిన సమస్యలపై జిల్లా మహాసభలో చర్చించి సమస్య ల పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించుకొని అంచలంచలాగా ఉద్యమిస్తామన్నారు. 12, 13 తేదీల్లో జరుగు మహాసభలకు సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, కత్తి నారాయణస్వామి, రాజేష్ గౌడ్, సంతోష్ కుమార్, పద్మావతి, పెద్దయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయి స్వామి, ఇన్సాఫ్ నాయకులు అలిపిర తదితరులు పాల్గొన్నారు.


