సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ, గ్రామీణ, అట్టడుగున ఉన్న ప్రజలందరికీ న్యాయంకూర్చడమే జాగృతి కమిటీ యొక్క లక్ష్యము అని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు చాంబర్లో జాగృతి కమిటీ సభ్యులతో జడ్జి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి కమిటీ నిర్వహించాల్సిన విధి,విధానాలు, ప్రజల వద్దకు న్యాయం జరిగే పలు సూచనలను వారి వివరించారు. అనంతరం జడ్జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎక్కడైనా సరే అన్యాయం జరిగిన చోట ఆ సమస్యను పరిష్కరించేంత వరకు జాగృతి కమిటీ కృషి చేయాలని తెలిపారు. ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా సమన్వయంతో కమిటీ ముందుండాలని తెలిపారు. న్యాయవ్యవస్థ, చట్టాలపై పూర్తి దశలో ప్రజలకు అవగాహన అందించాల్సిన బాధ్యత కూడా కమిటీకి ఉందని తెలిపారు. ప్రజలందరినీ జాగృతం చేస్తూ చైతన్యవంతంగా చేయాలని తెలిపారు. న్యాయవ్యవస్థ ప్రజలందరికీ అందినప్పుడే సమానమైన న్యాయం లభిస్తుందని తెలిపారు. అప్పుడే ప్రజలకు న్యాయం మీద నమ్మకం కలుగుతుందని తెలిపారు. ఈ జాగృతి కమిటీలో 14 మంది సభ్యులు న్యాయవ్యవస్థ పై, చట్టంపై ప్రజలకు చేరువలో ఉండే విధంగా కృషి చేయాలని తెలిపారు. న్యాయ సేవలు సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలని, అక్షరాస్యత లోపం ఉన్న గ్రామీణ ప్రాంతాలలో గల వారికి ఈ జాగృతి కమిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్త చట్టాలను పాత చట్టాలను అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో పేదరికానికి తప్పక న్యాయ సేవలు అందించే విధంగా ప్రతి ఒక్కరు బాధ్యతతో, సేవా గుణముతో, తమ విధులను నిర్వర్తించాలని వారు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చట్టముపై అవగాహన ప్రస్తుతం ఉన్నా కూడా, ఆ అవగాహనను వేగవంతంగా చేయవలసిన బాధ్యత కమిటీపై ఉందని తెలిపారు. అంతేకాకుండా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎన్ ఏ ఎల్ ఎస్ ఏ) సుప్రీం కోర్ట్ సూచనల మేరకు కమిటీ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ జాగృతి కమిటీ ద్వారా ఉచితంగా న్యాయాన్ని తప్పక అందజేయాల్సిన అవసరం ఉంది అని వారు మరోసారి గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్లనే గ్రామ ప్రజలు ఎన్నో విధాలుగా మోసానికి గురవుతున్నారని తెలిపారు. ఎవరికి ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను జాతీయస్థాయిలో తమకు కావలసిన న్యాయమును, సలహా, సూచనల మేరకు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమములో న్యాయవాదులు బాలసుందరి, బిల్లే రవీంద్ర, ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ, తహసిల్దార్ సురేష్ బాబు, అసిస్టెంట్ పోస్ట్మాస్టర్ మణికంఠ,వన్ టౌన్ ఎస్ఐ కేతన్న, పారా లీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు.
ప్రజలందరికీ న్యాయం చేకూర్చడమే జాగృతి కమిటీ యొక్క లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


