విశాలాంధ్ర- పామిడి : అనంతపురం జిల్లా పామిడి మండలంలోని జి. కొట్టాల గ్రామానికి చెందిన తలారి ముత్యాలు ఇటీవల కర్నూలు జిల్లా కేంద్రంలోని కర్నూలు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో చేరి కొన్ని రోజులుగా చికిత్స చేయించుకున్నారు. పింఛన సొమ్ము తీసుకోవడానికి వారు రాలేని పరిస్థితిలో ఉన్నట్లు అందులో అసలే పేదరికంతో ఉన్న తలారి ముత్యాలుకు పింఛన్ రాకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి వెల్ఫేర్ అసిస్టెంట్ రవి సామాజిక పింఛన్ల పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు మాత్రమే ఇచ్చింది. కొన్ని రోజులు పాటు వారు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉందని వైద్యులు సూచించడంతో వెల్ఫేర్ అసిస్టెంట్ రవి తన ఖర్చులతోనే ఆసుపత్రికి వెళ్లి పింఛను నగదును అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మండల ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.


