విశాలాంధ్ర`విజయవాడ (క్రైం): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద స్నానానికి దిగిన ముగ్గురు యువకుల్లో ఒకరు గల్లంతయ్యారు. ఈ ఘటన శనివారం ఇబ్రహీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇబ్రహీపట్నం కొత్తూరుకు చెందిన నవీన్(19) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్నాడు. మరో ఇద్దరు యువకులతో కలిసి ఫెర్రీ ఘాట్‌లో స్నానానికి వెళ్లాడు. స్నానం దిగిన ఇద్దరు యువకులు ఒడ్డున చేరుకోగా, నవీన్ వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఇబ్రహీపట్నం పోలీసులు ఘటన స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఫ్రెరీ ఘాట్‌లో విద్యార్ధి గల్లంతు
- Advertisement -
RELATED ARTICLES


