Thursday, January 15, 2026
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో పట్టపగలు దొంగతనం

ధర్మవరంలో పట్టపగలు దొంగతనం

- Advertisement -

రూ.1.10లక్షలు విలువ చేసే ల్యాప్ టాప్, సెల్ ఫోన్ దొంగతనం

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని లింగశెట్టిపాళ్యం వీధిలో బుధవారం ఉదయం సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లో గుర్తు తెలియని దొంగలు రూ.1.10లక్షలు విలువ చేసే ల్యాప్టాప్, సెల్ఫోన్ను దొంగతనం చేశారు. బాధితురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగి మౌలిక వన్ టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు మౌలిక తెలిపిన వివరాల మేరకు.. లింగశెట్టిపాళ్యం వీధిలో బుధవారం ఉదయం 8గంటల సమయంలో టేబుల్ పైన ల్యాప్టాప్, సెల్ఫోన్ పెట్టి వర్క్ చేసుకుంది. అనంతరం మిద్దెపై పని ఉండటంతో మిద్దెపైకి వెళ్లి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో తల్లి, తమ్ముడు లోపల గదిలో ఉండటంతో బయట రూమ్ లో టేబుల్ పైన ఉన్న కంపెనీ ల్యాప్టాప్, సెల్ఫోన్ ను గుర్తు తెలియని దొంగ వచ్చి దొంగతనం చేశాడు. ఇంటికున్న గేటు శబ్దం రావడంతో ఎవరో వచ్చారని ఇంట్లో కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి చూడగా గేటు ఓపెన్ చేసి ఉండటంతోపాటు టేబుల్పై ఉన్న ల్యాప్టాప్, సెల్ఫోన్ కనిపించలేదు. దీంతో దొంగతనం జరిగిందని తెలుసుకుని చుట్టుపక్కల ఎంత వెతికినా దొంగ అచూకి కనిపించలేదు. దీంతో బాధితురాలు మౌలిక వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు