కరెస్పాండెంట్ సిస్టర్ రిన్సి
విశాలాంధ్ర ధర్మవరం: అక్టోబర్ 18 వ తేదీన అనంతపురం ఆర్.డి.టీ. స్టేడియంలో లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలో ధర్మవరం, జీవన్ జ్యోతి స్కూల్ నందు 9 వ తరగతి విద్యార్థులు పి.ఉషశ్రీ, ఎస్. మనుస్కృతి సాయి ఉత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్ర స్థాయి ఎస్. జి.ఎఫ్ అండర్17 హాకీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ సుజాత తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు, డిసెంబర్ 11 వ తేదీ నుంచి 13 వ తేది వరకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా లో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో ఉమ్మడి అనంతపురం జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. ఎశీపికైన విద్యార్థులను పాఠశాల కరెస్పాండంట్ సిస్టర్ రిన్సీ,హెడ్మిష్ట్రెస్ సిస్టర్ సుజాత,ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు
- Advertisement -
RELATED ARTICLES


