విశాలాంధ్ర -ధర్మవరం; హిందూ సమ్మేళనం ధర్మవరంలో డిసెంబర్ 21సాయంత్రం 4.00 నుండి కాలేజీ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా వీటికి సంబంధించి వాల్పోస్టర్ విడుదల, స్థానిక ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ , ధర్మవరంలో మంత్రికార్యాలయంలో హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది అని పులి చర్ల వేణుగోపాల్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హిందువులు అందరూ, కులాలకు, వర్ణాలకు, వర్గాలకు, అతీతంగా, పిల్లలు పెద్దలు మాతృమూర్తులు కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళనం అనేది హిందూ ఐక్యతకు నిదర్శనమని వారు తెలిపారు. కావున వందలాదిమంది హిందువులు ఈ హిందూ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో
హిందూ సమ్మేళన నిర్వహణ సమితి కార్యదర్శి, సి కె వివేకానంద, సింగనమల కిషోర్ , బిజెపి సీనియర్ నాయకులు అంబటి సతీష్, నిర్వహణ సమితి సభ్యులు పాల్గొన్నారు
హిందూ సమ్మేళనం వాల్ పోస్టర్లు విడుదల
- Advertisement -
RELATED ARTICLES


