జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి , కంటి వైద్య నిపుణులు డాక్టర్ అనురాధ.
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ఆప్టికల్స్ షాపుల యందు కంటి పరీక్షలను ఆప్తాలని అసిస్టెంట్ మాత్రమే పరీక్షించాలని, ఇతరులు ఎవ్వరు కూడా పరీక్షించరాదని శ్రీ సత్యసాయి జిల్లా అంద త్వనివారణ సంస్థ అధికారి కంటి వైద్య నిపుణులు డాక్టర్ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆప్టికల్స్ షాపుల యజమానులతో, ఆప్తాలమిక్ అసిస్టెంట్లతో పట్టణంలోని డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కంటి పరీక్షలను నాణ్యతగా చూడాలని, ఇతర వ్యక్తుల చేత చూయించితే తప్పక చర్యలు తప్పవని వారు హెచ్చరించడం జరిగింది. గతంలో కొన్ని ఆప్టికల్స్ పై ఫిర్యాదులు అందడం జరిగిందని, ఇందులో భాగంగానే రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు సమక్షంలో కంటి అద్దముల షాపుల యందు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న ఆప్తాలమిక్ అసిస్టెంట్ లతో పలు విషయాలను చర్చించడం జరిగిందన్నారు. అదేవిధంగా కంటి షాపులు నిర్వహిస్తున్న అర్హతలను కూడా తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. కంటి పరీక్షలను ఆప్తాలమిక్ అసిస్టెంట్ మాత్రమే పరీక్షలు నిర్వహించి కంటి అద్దములు తప్పనిసరిగా రాయాలని తెలపడం జరిగిందని తెలిపారు. కంటి షాపుల వారు “కంటి పరీక్షా కేంద్రం “అని మాత్రమే బోర్డు రాయాలని తెలిపారు. అదేవిధంగా కంటి పరీక్ష కేంద్రాలలో మందులు రోగులకు ఇచ్చిన, లేదా సిఫార్సు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగిందన్నారు. ఆప్టికల్ షాపుల యందు కంటికి సంబంధించిన మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని, స్టాకు ఉంచుకోకూడదని తీవ్రంగా హెచ్చరించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ చట్టం ప్రకారం ఆప్టికల్ షాపులు వారు మసలుకోవాలని, అలా కాకుండా విరుద్ధంగా చేసినచో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించడం జరిగిందని తెలిపారు.
ఆప్టికల్స్ షాపుల యందు తప్పనిసరిగా ఆప్తాలమిక్ అసిస్టెంట్ ఉండాలి..
- Advertisement -
RELATED ARTICLES


