ధర్మవరం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో యుటిఎఫ్ నిరసన
విశాలాంధ్ర ధర్మవరం; ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని,పార్లమెంటులో ఆర్ టి ఈ యాక్ట్ సెక్షన్ 23(1)ను అమెండ్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, సింగల్ టీచర్ సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే బదిలీలు పొంది వారి స్థానాలలో కొత్తవారు రాక అక్కడే కొనసాగుతున్న టీచర్లను వెంటనే బదిలీ అయిన స్థానాలకు రిలీవ్ చేయాలని, అదేవిధంగా రెండవ శనివారం, ఆదివారాల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతులు నిర్వహించ వద్దని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో కాలేజ్ సర్కిల్ నుండి ఆర్డిఓ ఆఫీస్ ఎదుట వరకు ప్రదర్శనగా వెళ్లి అనంతరం ధర్మవరం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి,అనంతరం ధర్మవరం డివిజన్ ఆర్డిఓ మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమం లో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు, రాష్ట కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి ,జిల్లా కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, ధర్మవరం డివిజన్ నాయకులు ఆంజనేయులు ,అమర్ నారాయణరెడ్డి, లక్ష్మయ్య ,సురేష్ ,చంద్రశేఖర్, రాంప్రసాద్, లతా దేవి, నాగేంద్రమ్మ , యాస్మిన్ సుల్తానా, శ్రీలత, రామాంజనేయులు ,సాయి గణేష్ ,వెంకట కిషోర్. జనార్ధన్, శివయ్య, గోపాల్ రెడ్డి, గోపాలరావు, ఆదిశేషు, రాజేశ్వరరావు, బాలాజీ లక్ష్మీనారాయణ ,రామకృష్ణ, బాలగోండ్ల ఆంజనేయులు, టోపీ వలి, విశ్వనాథ్, హేమంత్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలి…
- Advertisement -
RELATED ARTICLES


