–సిపిఐ తరఫున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 10 న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ఆస్పరి చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్డు దిగ్బంధ ఉద్యమం విజయవంతంగా ముగిసిందని, ఈ ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందించిన కార్యకర్తల నుండి శ్రేయోభిలాషుల వరకు అందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు
సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి పేర్కొన్నారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు దిగ్బంధ నిరసన విజయవంతం కావడానికి సహకరించిన పార్టీ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, స్థానిక ప్రజలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సిపిఐ మండల సమితి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు ఆంజనేయ, హమాలి సంఘం నాయకులు హనుమంతు, రంగన్న, పాండు, గోపాల్, శేఖర్, రామయ్య, వీరశేఖర్, వీరేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.


